News April 1, 2024
మయామి ఓపెన్ ఛాంపియన్‌గా కోలిన్స్

మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ-1000 టోర్నీ ఛాంపియన్‌గా అమెరికా టెన్నిస్ ప్లేయర్ డానియల్ కోలిన్స్ నిలిచింది. ఫ్లోరిడాలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినాపై విజయం సాధించింది. దీంతో ఆమెకు రూ.9 కోట్ల 16లక్షల ప్రైజ్‌మనీతో పాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కాగా ఈ ఏడాది ఆమె ఆటకు వీడ్కోలు పలకనున్నారు.
Similar News
News February 9, 2026
T20WCలో నేడు..

T20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ కోల్‌కతా, కొలంబో, అహ్మదాబాద్ వేదికగా 3 మ్యాచ్‌లు జరగనున్నాయి.
* ఉ.11 నుంచి.. స్కాట్లాండ్vsఇటలీ
* మ.3 నుంచి.. జింబాబ్వేvsఒమన్
* రా.7 నుంచి.. దక్షిణాఫ్రికాvsకెనడా
LIVE: స్టార్‌స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్
News February 9, 2026
కిరాణాషాపులకు దెబ్బ?

ఇప్పటివరకు మెట్రో సిటీలకే పరిమితమైన క్విక్ కామర్స్ రంగం టైర్ 3/4 నగరాలకు వచ్చేసింది. ఇండియాలోని 200 నగరాల్లో బ్లింకిట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాబోయే ఐదేళ్లలో భారీగా కిరాణా దుకాణాలు మూతపడే అవకాశం ఉందని వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే 10 ని. డెలివరీ ప్రభావం కిరాణాషాపులపై అంతగా ఉండదని, మెట్రో సిటీల్లో ఇది చూశామని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ COMMENT?
News February 9, 2026
US సైనిక మోహరింపులకు భయపడం: ఇరాన్

అమెరికాతో <<19053726>>చర్చల్లో<<>> యురేనియం శుద్ధి విషయంలో వెనక్కి తగ్గబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమను ఆదేశించే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. <<19009250>>సైనిక మోహరింపు<<>>లతో అమెరికా తమను భయపెట్టలేదని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ అన్నారు. ‘మాకు USపై పెద్దగా నమ్మకం లేదు. ఆ దేశంతో చర్చల గురించి మా వ్యూహాత్మక భాగస్వాములైన చైనా, రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని తెలిపారు.


