News August 14, 2024
మారనున్న రేషన్ కార్డుల రంగులు

AP: పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డులపై వైసీపీ రంగులు, YSR, YS జగన్ ఫొటోలు ముద్రించి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రేషన్ కార్డుల రంగులు మారనున్నాయి. వీటికి సంబంధించిన డిజైన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Similar News
News January 18, 2026
దావోస్‌కు బయలుదేరిన CM చంద్రబాబు

AP: వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు CM చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం దావోస్‌కు బయల్దేరింది. రేపు ఉదయం 11 గంటలకు జ్యూరిచ్‌కు చేరుకోనుంది. సాయంత్రం తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని, రోడ్డు మార్గాన దావోస్‌కు CBN వెళ్లనున్నారు. UAE మంత్రి అబ్దుల్లా, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌తో భేటీ కానున్నారు. ఆయన వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ ఉన్నారు.
News January 18, 2026
తెలంగాణ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు

* మెట్రో ఫేజ్ 2ఏ, ఫేజ్ 2బీ భూసేకరణకు సంబంధించి రూ.2,787 కోట్ల కేటాయింపునకు ఆమోద ముద్ర
* ములుగు జిల్లాలో సాగునీరు అందించేందుకు పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం
* 2027లో జులై 27- ఆగస్టు 3 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు బాసర-భద్రాచలం వరకు ఉన్న పురాతన ఆలయాల శాశ్వత అభివృద్ధి, ఎకో పార్కుల నిర్మాణానికి నిర్ణయం
* మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి నిర్ణయం
News January 18, 2026
30ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు చేయించుకుంటే బెటర్

30ఏళ్లు దాటిన వాళ్లు అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే సమస్యను గుర్తించి చికిత్స తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఏడాదికోసారి BP, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, కిడ్నీ ఫంక్షన్, కంటి పరీక్షలు, థైరాయిడ్ టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు. 30-65ఏళ్ల మహిళలు ప్రతి 3సంవత్సరాలకు పాప్ స్మియర్/5ఏళ్లకు HPV టెస్ట్ చేయించుకోవాలని చెబుతున్నారు.


