News March 16, 2024
ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ అభ్యర్థులు- 1/2

● డోన్: బుగ్గన రాజేంద్రనాథ్
● పత్తికొండ: కంగాటి శ్రీదేవి
● కోడుమూరు: డా.సతీశ్
● ఎమ్మిగనూరు: బుట్టా రేణుక
● మంత్రాలయం: వై.బాలనాగి రెడ్డి
● ఆదోని: వై.సాయి ప్రసాద్ రెడ్డి
● ఆలూరు: విరుపాక్షి
Similar News
News August 14, 2025
వీధి కుక్కలు లేకపోతే ఎలుకలు పెరుగుతాయా?

ఢిల్లీలో వీధి <<17384668>>కుక్కలన్నింటినీ<<>> షెల్టర్లకు తరలించాలని SC ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఫ్లాష్‌బ్యాక్‌కి వెళితే 1880ల్లో రేబిస్ కారణంగా పారిస్ పెద్ద సంఖ్యలో కుక్కలను చంపేసింది. తర్వాత అక్కడ ఎలుకల సంఖ్య బాగా పెరిగింది. సాధారణంగా ఎలుకల నియంత్రణలో వీధి కుక్కలది కీలకపాత్ర. నిజానికి ఎలుకలూ తీవ్ర నష్టం చేయగలవు. అటు వీధులన్నీ తిరిగే కుక్కలు అనేక రోగాల వ్యాప్తికి కారణమనే బలమైన వాదన ఉంది. దీనిపై మీ కామెంట్?
News August 14, 2025
భూధార్ నంబర్ల కేటాయింపుపై అధికారులకు CM ఆదేశాలు

TG: భూములకు భూధార్ నంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన వారసత్వ, ఇతర మ్యుటేషన్ల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సమీక్ష సమావేశంలో సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో కొత్తగా నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పార్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక వసతులు ఉండేలా చూడాలన్నారు.
News August 14, 2025
RBI కీలక నిర్ణయం.. గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్

బ్యాంకుల్లో చెక్కుల క్లియరెన్స్‌పై RBI కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ ప్రక్రియకు 2 రోజుల సమయం పడుతుండగా తాజా నిర్ణయంతో కొన్ని గంటల్లోనే క్లియరెన్స్ రానుంది. ఈ విధానం అక్టోబర్ 4 నుంచి తొలి దశలో, వచ్చే ఏడాది జనవరి 3 నుంచి రెండో దశలో అమల్లోకి వస్తుంది. ఇందుకోసం ట్రంకేషన్ సిస్టమ్‌లో RBI మార్పులు చేయనుంది. దీంతో బ్యాంకు పని వేళల్లోనే చెక్కును స్కాన్ చేసి కొన్ని గంటల్లోనే పాస్ చేయనున్నాయి.