News May 7, 2025
కర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట కొండల్లో భద్రతాబలగాల ‘ఆపరేషన్ కగార్’ కొనసాగుతోంది. మావోయిస్టుల అగ్రనేతృత్వమంతా కర్రెగుట్టలోనే ఉందన్న వార్తల నేపథ్యంలో వేలాది బలగాలు కొండల్ని దిగ్బంధించాయి. ఈ ఆపరేషన్‌ను ఆపాలని మావోయిస్టులు లేఖ విడుదల చేసినా కేంద్రం స్పందించకపోవడం గమనార్హం. అటు మానవహక్కుల సంఘాలు కూడా ఆపరేషన్‌ను ఆపాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
Similar News
News December 21, 2025
BRS ఆధ్వర్యంలో జల సాధన ఉద్యమం?

తెలంగాణ రాష్ట్రంలో మరో జల సాధన ఉద్యమం తప్పదని మాజీ సీఎం KCR భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని BRS ఆరోపిస్తోంది. ఇవాళ్టి పార్టీ కార్యవర్గ సమావేశంలో వారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు దీనిపై దిశానిర్ధేశం చేయనున్నట్లు సమాచారం.
News December 21, 2025
మరిగించిన టీ.. 20 నిమిషాల తర్వాత తాగుతున్నారా?

టీ కాచిన 20 నిమిషాల తర్వాత తాగడం మంచిది కాదని హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. రూమ్ టెంపరేచర్‌లో ఆక్సిడేషన్ జరిగి బ్యాక్టీరియా ఉత్పత్తి కేంద్రంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. రెండోసారి కాచిన టీ తాగితే జీర్ణాశయ, లివర్ సమస్యలు వస్తాయంటున్నారు. 24 గంటల తర్వాత టీని జపాన్‌లో పాము కాటు కంటే ప్రమాదకరమైనదిగా, చైనాలో విషంతో పోలుస్తారు. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే బ్యాక్టీరియా పెరుగుదల నెమ్మదిస్తుంది.
News December 21, 2025
దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ కుమ్మక్కు: బీజేపీ

భారత వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతులు కలుపుతున్నారని బీజేపీ నేత గౌరవ్ భాటియా ఆరోపించారు. జార్జ్ సోరోస్‌తో లింక్ ఉన్న బెర్లిన్ హెర్టీ స్కూల్ అధ్యక్షురాలు కార్నెలియా వోల్‌తో రాహుల్ సమావేశమయ్యారని తెలిపారు. ఆయన విదేశీ పర్యటనల్లో పారదర్శకత ఉండాలన్నారు. దాదాపు ప్రతి పార్లమెంట్ సెషన్ సమయంలో/ముందు రాహుల్ విదేశాల్లో పర్యటించడం కొత్తేమీ కాదని, వాటి వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలన్నారు.


