News November 20, 2024
దేవుడిలా వచ్చి.. వేల మందిని కాపాడి!

తేలు కాటుకు ఒకప్పుడు విరుగుడు లేకపోవడంతో ఎంతో మంది చనిపోయేవారు. ముఖ్యంగా MHలోని గ్రామీణ ప్రాంతాల్లో 1980లలో మరణాలు పెరగడంతో డా.హిమ్మత్రావ్ బావస్కర్ బాధితులను కాపాడేందుకు ముందుకొచ్చారు. ఆయన కొత్త మిషన్ ప్రారంభించి తేలు చికిత్సపై ప్రయోగాలు చేసి ఫలితం సాధించారు. దీనిని వైద్యులకూ నేర్పించడంతో ప్రజల జీవితాలు మారిపోయాయి. తేలు కాటు మరణాలు 40% నుంచి 1శాతానికి తగ్గాయి. ఆయనను 2022లో పద్మశ్రీ వరించింది.
Similar News
News November 25, 2025
ఓయూ: ఆదివాసి బిడ్డకు ఓయూ డాక్టరేట్

ఆదివాసీ విద్యార్థి, ఉద్యమ నేత సాగబోయిన పాపారావుకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. సోషియాలజీ ప్రొ.పి విష్ణుదేవ్ పర్యవేక్షణలో ‘ఉప ప్రణాళిక, గిరిజన అభివృద్ధి రాష్ట్రంలోని ఐటీడీఏ భద్రాచలం సామాజిక శాస్త్ర అధ్యయనం’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గాను ఓయూ ఆయనకు డాక్టరేట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధ్యాపకులు అభినందించారు.

శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం?

రష్యాతో పీస్ డీల్కు ఉక్రెయిన్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పింది’ అని అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది. అయితే చర్చలు కొనసాగుతున్నాయని, ఖరారు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అబుదాబిలో US, రష్యా బృందాలు చర్చలు జరుపుతున్నాయి.