News December 21, 2024

రండి.. గన్‌మెన్లు లేకుండా వెళ్దాం: రేవంత్

image

TG: మూసీ మురుగు నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కల్పిద్దామంటే BRS కాళ్లలో కట్టెలు పెడుతోందని CM రేవంత్ మండిపడ్డారు. ‘ఆ జిల్లా మహిళలు గర్భం దాల్చేందుకూ భయపడుతున్నారు. మూసీ పునరుజ్జీవం వద్దని ప్రజలు చెబుతున్నారని BRS అంటోంది. రండి.. KTR వస్తారో? హరీశ్ వస్తారో? నేను కూడా గన్‌మెన్లు లేకుండా వస్తా. నల్గొండ పోదామా? భువనగిరి పోదామా? ఆలేరు పోదామా? మూసీ పునరుజ్జీవం కావాలో, వద్దో అడుగుదాం?’ అని అన్నారు.

Similar News

News December 1, 2025

వరంగల్‌: హెచ్ఐవీ కేసులు ఆందోళనకరం!

image

జిల్లాలో ఇప్పటి వరకు 5,464 మంది హెచ్ఐవీ బాధితులు నమోదు కాగా, వీరిలో 4,558 మందికి ప్రభుత్వం ప్రతి నెల ఉచిత మందులు అందిస్తోంది. 863 మంది బాధితులకు ఏఆర్జే ద్వారా నెలకు రూ.2,016 పెన్షన్ ఇస్తున్నారు. నెలకు సగటున 36 కొత్త హెచ్ఐవీ కేసులు వెలుగులోకి వస్తుండటం, గర్భిణులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో హై రిస్క్ వ్యక్తులు 3,498 మంది ఉన్నారు.
#నేడు ప్రపంచ ఎయిడ్స్ డే.

News December 1, 2025

‘108’ సంఖ్య విశిష్టత

image

ధర్మశాస్త్రాల ప్రకారం.. మానవుడి శరీరంలో 108 ముఖ్యమైన నరాలు, మెదడులో 108 శక్తి కేంద్రాలు ఉన్నాయని చెబుతారు. వీటన్నింటినీ ఉత్తేజితం చేయడానికి ఓ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలని సూచిస్తారు. ఇలా చేస్తే మంత్రంలోని శక్తి ఈ కేంద్రాలన్నింటికీ ప్రసరించి, సంపూర్ణ ఆధ్యాత్మిక ఫలం వస్తుందని నమ్మకం. పగడాల మాలతో జపం చేస్తే.. వేయింతల ఫలం, రత్నమాలతో చేస్తే పదివేల రెట్ల ఫలం వస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి.

News December 1, 2025

SBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

SBIలో 15 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీటిలో 5 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, 10 మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ పోస్టులకు వేర్వేరుగా అప్లై చేసుకోవాలి. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ , బీఈ, బీటెక్, MBA/MS/PGDBM/PGDBA ఫైనాన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in