News January 3, 2025
హైందవ శంఖారావానికి తరలిరండి: VHP
AP: విజయవాడ కేసరపల్లి వద్ద JAN 5న జరిగే హైందవ శంఖారావం సభకు హిందువులు తరలిరావాలని VHP పిలుపునిచ్చింది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో 30 ఎకరాల్లో భారీ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వాలు హిందూ ఆలయాలను తమ అధీనంలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాయని VHP నేత గోకరాజు గంగరాజు మండిపడ్డారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఆలయాల కోసం పోరాటం చేస్తామన్నారు.
Similar News
News January 5, 2025
దంపతుల టోకరా.. వ్యాపారవేత్తకు ₹7.63 కోట్ల మోసం
అధిక రాబడులకు ఆశ పడి నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ₹7.63 కోట్లు నష్టపోయారు. జయంత్ గులాబ్రావ్, అతని భార్య కేసరి ఓ సంస్థలో పెట్టుబడులు పెడితే ఏటా 35% లాభాలు వస్తాయని జితేందర్ జోషిని నమ్మించారు. ప్రారంభంలో మంచి లాభాలు రావడంతో జోషి భారీగా పెట్టుబడులు పెట్టారు. తీరా జయంత్ దంపతులు మొహం చాటేయడంతో జోషి ₹7.63Cr మోసపోయారు. ఆర్థిక నేర విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
News January 5, 2025
గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన కార్ల్సన్
ప్రపంచ నంబర్-1 చెస్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ గర్ల్‌ఫ్రెండ్ ఎల్లా విక్టోరియా మలోన్ను పెళ్లి చేసుకున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకను నెట్‌ఫ్లిక్స్ సినీ బృందం చిత్రీకరించింది. ఇటీవల కార్ల్సన్ ఎనిమిదో సారి వరల్డ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్‌గా నిలవగా, టైటిల్ షేరింగ్ విషయంపై కాంట్రవర్సీ నడిచిన విషయం తెలిసిందే.
News January 5, 2025
స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ గడువు పెంపు
TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల గడువును మార్చి 31 వరకు పొడిగించారు. సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ-పాస్ వెబ్సైటులో దరఖాస్తు చేసేందుకు గతంలో గడువు విధించగా, చాలా మంది అప్లై చేయలేదు. 7.44 లక్షల మంది రెన్యువల్ విద్యార్థుల్లో 4 లక్షల మంది, 4.83 లక్షల మంది కొత్త వారిలో కేవలం 1.39 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు.