News August 30, 2025
ఏపీకి వస్తున్నాం.. IBM ప్రకటన

AP: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్‌పార్క్‌లో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పెడుతున్నట్లు దిగ్గజ IT సంస్థ IBM ప్రకటించింది. 2026 మార్చి నాటికి దీనిని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధి క్రౌడర్ ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతుందని, భవిష్యత్తులో ఈ రంగంపై ఎక్కువ పరిశోధనలు చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం USA, జపాన్, కెనడా, ద.కొరియాలో IBM క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయి.
Similar News
News August 30, 2025
ప్రతి చెరువుకూ నీళ్లిచ్చే బాధ్యత నాది: చంద్రబాబు

AP: అసత్యాలు చెప్పడంలో YCP దిట్టని చిత్తూరు(D) పరమసముద్రం బహిరంగ సభలో CM చంద్రబాబు విమర్శించారు. ‘గేట్లతో సెట్టింగులేసి నీళ్లు తెచ్చినట్లు డ్రామాలాడటం చూశాం. మల్యాలలో మొదలైతే పరమసముద్రానికి నీళ్లు తెచ్చాం. 27 లిఫ్ట్ ఇరిగేషన్లతో నీళ్లు తరలిస్తున్నాం. కుప్పానికి రెండేళ్ల ముందే కృష్ణా పుష్కరాలొచ్చాయి. రాయలసీమను రతనాలసీమ చేసే బాధ్యత నాదని ముందే చెప్పా. ప్రతి చెరువుకూ నీళ్లిస్తాం’ అని తెలిపారు.
News August 30, 2025
రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేయాలని క్యాబినెట్ నిర్ణయం

TG: పంచాయతీల్లో రిజర్వేషన్లలో గత ప్రభుత్వం విధించిన 50% పరిమితిని ఎత్తివేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 (A)కు సవరణ చేయనుంది. దీని ద్వారా రిజర్వేషన్లలో 50% సీలింగ్‌ను మార్చనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ జీవో తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
News August 30, 2025
సీమకు CBN అభినవ కృష్ణదేవరాయలు: నిమ్మల

AP: 738 కి.మీ. పొడవున్న హంద్రి-నీవా కెనాల్ ఆసియాలోనే అతి పెద్దదని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ‘రాయల పరిపాలనలో.. రాయలసీమ రతనాల సీమగా విలసిల్లేదని చరిత్ర చెబుతోంది. అక్కడి నుంచి TDP ఆవిర్భావం వరకూ సీమ కరవు ప్రాంతంగా ఉండిపోయింది. ఎన్టీఆర్ రాయలసీమకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. రాయలసీమను తిరిగి రతనాల సీమగా మారుస్తున్న చంద్రబాబు అభినవ శ్రీకృష్ణదేవరాయలు’ అని తెలిపారు.