News May 22, 2024
27న హజ్ యాత్ర ప్రారంభం

AP: హజ్ యాత్రకు వెళ్లే హాజీల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ హజ్ కమిటీ కార్యనిర్వాహక అధికారి తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మూడు విమానాల్లో యాత్రికులను తీసుకెళ్తామని పేర్కొన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లిలోని ఈద్గా మసీదు వద్ద వసతి క్యాంపు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరింత సమాచారం కోసం 1800 4257873 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించాలని కోరారు.
Similar News
News November 28, 2025
VKB: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్

వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో చేవెళ్ల-శంకర్పల్లి రూట్లో ఒక ప్రయాణికురాలు తన బ్యాగును మర్చిపోయింది. అందులో సుమారు రూ.2 లక్షల నగదు ఉంది. ఈ బ్యాగును గుర్తించిన కండక్టర్ మీనా, వెంటనే పోగొట్టుకున్న మహిళకు డబ్బును తిరిగి ఇచ్చారు. కండక్టర్ మీనా నిజాయితీని పలువురు ప్రశంసించారు.
News November 28, 2025
నేడే రాజధానిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

AP: రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. దేశంలోని 15 ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు రాజధానిలో తమ ఆఫీసులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటికి ఈ ఉదయం 11.22గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, CM CBN చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. రూ.1,334 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆయా బ్యాంకులు, బీమా సంస్థల ప్రతినిధులు, మంత్రులు, రాజధాని రైతులు హాజరుకానున్నారు.
News November 28, 2025
కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్

భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆ దేశం రూ.100 నోట్లను రిలీజ్ చేయగా, వాటిపై కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలు తమవే అన్నట్లు మ్యాప్ను ముద్రించింది. 2020లో అప్పటి PM కేపీ శర్మ ఓలీ మ్యాప్ను సవరించగా, దాన్ని ఇప్పుడు నోట్లపై ప్రింట్ చేశారు. ఈ చర్యను ఖండించిన భారత్.. ఆ 3 ప్రాంతాలు IND అంతర్భాగాలని పేర్కొంది. నేపాల్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని చెప్పింది.


