News September 10, 2024
ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం

AP: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియను జలవనరుల శాఖ ప్రారంభించింది. 50 టన్నుల బరువు ఎత్తే కెపాసిటీ ఉన్న 2 క్రేన్లతో పనులు చేపట్టింది. ఈనెల 1న ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 4 పడవలు 67, 68, 69 గేట్ల వద్ద చిక్కుకోగా, అవి ఢీకొని బ్యారేజ్ కౌంటర్ వెయిట్లు ధ్వంసమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2,09,937 క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తుండగా, 68, 69 గేట్లను క్లోజ్ చేసి పనులు జరిపిస్తున్నారు.
Similar News
News November 29, 2025
ధర్మవరంలో EVM గోడౌన్లను తనిఖీ చేసిన కలెక్టర్

ధర్మవరం మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోడౌన్లను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు మార్గదర్శకాల ప్రకారం నెలవారీ తనిఖీల్లో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ల భద్రతకు తీసుకుంటున్న జాగ్రత్తలను ఆయన సమీక్షించారు. గోడౌన్ వద్ద సీసీ కెమెరా వ్యవస్థ, ఫైర్ సేఫ్టీ, 24 గంటల భద్రతా ఏర్పాటు చేయాలన్నారు.
News November 29, 2025
గోవాడలో దాన్యం కొనుగోలు పరిశీలించిన కలెక్టర్.!

అమర్తలూరు మండలం గోవాడలోని రైతుసేవా కేంద్రంలో దాన్యం కొనుగోలు ప్రక్రియను శుక్రవారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. దళారుల మాటలు విని ధాన్యాన్ని తక్కువ రేటుకి అమ్ముకోవద్దని అన్నారు. రైతుసేవా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.