News February 22, 2025

‘ఛావా’పై వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన నటి

image

‘ఛావా’ మూవీలో ఔరంగజేబు చేతిలో శంభాజీ అనుభవించిన హింస అంతా కల్పితమని నటి స్వర భాస్కర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె వివరణ ఇచ్చారు. ‘నా ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఛత్రపతి శివాజీ ఘనతల్ని గౌరవిస్తాను. గత వైభవం పేరు చెప్పి నేడు చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చకండి అని చెప్పడమే నా ఉద్దేశం. చరిత్ర అందర్నీ కలిపేదిగా ఉండాలని కానీ విడదీసేలా కాదు’ అని సూచించారు.

Similar News

News February 22, 2025

BREAKING: రాష్ట్రంలో 14,236 ఉద్యోగాలు

image

TG: రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖలో కొలువుల జాతరకు ప్రభుత్వం సిద్ధమైంది. 6,399 అంగన్వాడీ టీచర్, 7,837 హెల్పర్ల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే 14,236 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.

News February 22, 2025

పంట పొలంలో పెళ్లి.. వైరల్

image

భారీ ఫంక్షన్ హాల్, డెకరేషన్, డీజే చప్పుళ్ల మధ్య పెళ్లిళ్లు జరుగుతున్న ఈ రోజుల్లో పంజాబ్‌కు చెందిన ఓ జంట వినూత్నంగా ఆలోచించింది. తమ గ్రామంలోని పంట పొలం మధ్య వివాహం చేసుకుని దుర్లభ్ సింగ్, హర్మన్‌కౌర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ రైతులు చేసిన పోరాట నినాదాలను ముద్రించిన స్వీట్ బాక్సులను అతిథులకు అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

News February 22, 2025

కాంగ్రెస్ అసమర్థత వల్లే SLBC ఘటన: హరీశ్

image

TG: SLBC <<15542138>>సొరంగం<<>> కూలిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు, చేతగానితనానికి నిదర్శనమని హరీశ్‌రావు మండిపడ్డారు. 4 రోజులుగా కొద్దికొద్దిగా మట్టి కూలుతోందని తెలిసినా జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మరోవైపు, KTR స్పందిస్తూ.. ఘటన ఉ.8:30కు జరిగితే మధ్యాహ్నం దాకా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఏ ప్రయత్నాలు చేస్తున్నారో వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు.

error: Content is protected !!