News February 11, 2025

పేరెంట్స్ శృంగారంపై కామెంట్స్.. వీడియో తొలగించిన యూట్యూబ్

image

‘ఇండియాస్ గాట్ లేటెంట్‌’లో పేరెంట్స్ శృంగారంపై యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియ చేసిన <<15413969>>అభ్యంతకర వ్యాఖ్యలు<<>> దుమారం రేపుతున్నాయి. పార్లమెంటులోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలో మొత్తం ఎపిసోడ్‌ వీడియోను యూట్యూబ్ తొలగించింది. సమాచార మంత్రిత్వ శాఖ, NHRC ప్రతినిధుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. తన వ్యాఖ్యలపై రణ్‌వీర్ క్షమాపణ కోరిన విషయం తెలిసిందే.

Similar News

News February 11, 2025

ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ పలు విభాగాల్లోని బకాయిలు చెల్లిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.22,507 కోట్లు తీర్చేసినట్లు తెలిపారు. కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల ఆలస్యంపై స్పందిస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిందేనని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.

News February 11, 2025

మీ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారా? ఇలా చేయండి!

image

ఇన్‌స్టా వాడే పిల్లలు, టీనేజర్ల కోసం ‘మెటా’ ఇండియాలో టీన్ ఖాతాలను ప్రవేశపెట్టింది. ఇందులో పిల్లలకు అసభ్యకర పోస్టులు, సెన్సిటివ్ కంటెంట్ కనిపించకుండా, అధునాతన సెక్యూరిటీతో ప్రైవసీ ఉంటుంది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో కఠినమైన ప్రైవసీ సెట్టింగ్స్, కంటెంట్ గోప్యతా సెట్టింగ్‌లు, కంటెంట్ కంట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి. 16ఏళ్లలోపు వారు ఈ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పటికే ఉంటే అది టీన్ ఖాతాలోకి మారిపోతుంది.

News February 11, 2025

ఉద్యోగం కోసం రోజూ 700KMS ప్రయాణం!

image

హైదరాబాద్‌లో ఉంటోన్న ఉద్యోగులను అడగండి రోజూ ట్రాఫిక్‌లో ప్రయాణం ఎలా ఉంటుందో. అలాంటిది ఉద్యోగం కోసం రోజూ 700 కి.మీలు ప్రయాణిస్తోందో మహిళ. భారత సంతతికి చెందిన రాచెల్ కౌర్ మలేషియాలోని కౌలాలంపూర్‌లో పనిచేస్తున్నారు. పెనాంగ్‌లో నివాసముంటుండగా వారంలో 5 రోజులు విమానంలో ఆఫీసుకెళ్తుంటుంది. ఉదయం 4గంటలకే లేచి ఆఫీసుకు వెళ్తానని ఆమె చెప్పారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేసేందుకు ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!