News August 18, 2024
ప్రభాస్‌పై కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన ‘కార్తికేయ-2’ నిర్మాత

ప్రభాస్‌ను ఉద్దేశించి బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సీ చేసిన <<13885603>>వ్యాఖ్యలకు<<>> కార్తికేయ-2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ కౌంటరిచ్చారు. ‘దేశం గర్వపడేలా ప్రభాస్ ‘బాహుబలి’ సిరీస్‌లో నటించి మన సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టారు. ‘కల్కి’ అదే బాటలో పయనించింది. అలాంటి వారిపై వెక్కిరింపులు చేయకుండా మద్దతుగా నిలవాలి. మాకు సర్క్యూట్(మున్నాభాయ్ MBBSలో వర్సీ పాత్ర) కావాలి. షార్ట్ సర్క్యూట్ కాదు’ అని హితవు పలికారు.
Similar News
News October 14, 2025
విశాఖలో మొట్టమొదటి గూగుల్ AI హబ్: సుందర్

డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటన చేశారు. ‘విశాఖపట్నంలో తొలి ఏఐ హబ్‌కు సంబంధించిన ప్రణాళికపై ప్రధాని మోదీతో మాట్లాడా. ఈ ఏఐ హబ్ కీలక మైలురాయి కానుంది. ఈ కేంద్రంలో గిగావాట్ సామర్థ్యం ఉండే హైపర్ స్కేల్ డేటా సెంటర్, ఇంటర్నేషనల్ సబ్‌సీ గేట్‌వే & భారీ స్థాయి ఇంధన మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. దీనిద్వారా AI ఆవిష్కరణలు వేగవంతం చేస్తాం.’ అని Xలో పేర్కొన్నారు.
News October 14, 2025
RSS సమావేశాలపై బ్యాన్‌కు కర్ణాటక CM ఆదేశం

RSS సమావేశాలను ప్రభుత్వ సంస్థలు, స్థలాల్లో నిషేధించేలా చర్యలకు CSను ఆదేశించినట్లు కర్ణాటక CM సిద్దరామయ్య తెలిపారు. TNలో మాదిరిగా రాష్ట్రంలోనూ చర్యలు తీసుకోవాలని మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖపై ఆయన స్పందించారు. కాగా RSS మతం పేరిట విద్యార్థుల మనసులను కలుషితం చేస్తోందని ఖర్గే ఆరోపించారు. BJP నేతల పిల్లలు అందులో ఎందుకు ఉండరని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థల్లో దాని సమావేశాలను అనుమతించబోమన్నారు.
News October 14, 2025
అరిషడ్వర్గాలను తొలగించే ఆరు నియమాలు

కృష్ణుడికి ఇష్టమైన కార్తీక దామోదర మాసంలో ఆయనను భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. మన ప్రేమకు ఆయన బందీ అవుతాడని పండితులు చెబుతున్నారు. ప్రార్థన, మహామంత్ర జపం, దామోదర లీలా పఠనం, సాత్విక నివేదన, దీపారాధన, దామోదరాష్టకం పఠనం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని అంటున్నారు. ఈ 6 నియమాలు పాటిస్తే మనలోని అరిషడ్వర్గాలు తొలగి, శ్రీకృష్ణ కటాక్షం సిద్ధిస్తుందని పేర్కొంటున్నారు. ఇల్లు గోకులంగా వెలుగొందుతుందని అంటున్నారు.