News October 6, 2025
విష్ణువుపై వ్యాఖ్యలు.. CJIపై దాడికి కారణమిదేనా?

SCలో CJI BR గవాయ్‌పై ఓ వ్యక్తి వస్తువు విసిరేందుకు యత్నించడం తెలిసిందే. MPలోని ఖజురహో టెంపుల్‌లో ధ్వంసమైన విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించాలన్న పిటిషన్‌పై విచారణ సమయంలో CJI వ్యాఖ్యలే దాడికి కారణంగా తెలుస్తోంది. ‘ఈ సైట్ ASI పరిధిలో ఉంది. మీరు విష్ణువు పరమ భక్తుడని చెబుతున్నారు కదా. వెళ్లి ప్రార్థించండి. ఏదైనా చేయమని అడగండి’ అంటూ పిటిషన్‌ను కొట్టేశారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
Similar News
News October 6, 2025
బిహార్‌లో విజయం NDAదే: Matrize Opinion Poll

బిహార్‌లో ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని Matrize Opinion Poll అంచనా వేసింది. NDA (బీజేపీ, జేడీయూ)కి 150-160 సీట్లు వస్తాయని, మహాఘట్‌బంధన్ (ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు) 70-85 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఎన్డీయేకి 49%, మహాఘట్‌బంధన్‌కు 36% ఓట్లు పోలవుతాయని తెలిపింది. ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్ పార్టీకి 2-5 సీట్లు వస్తాయని వివరించింది.
News October 6, 2025
వీరి రుణం తీర్చుకుంటేనే మానవ జన్మకు సార్థకత

మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి పితృ, దైవ, రుషి రుణాలు తీర్చుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంతో కష్టపడి పెంచిన తండ్రికి ధర్మబద్ధంగా ఉంటూ తనయుడు తన రుణం తీర్చాలి. ఈ సృష్టిని పోషిస్తున్న భగవంతుని రుణం ధర్మాచరణతో తీర్చాలి. ఇక జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులు, రుషుల రుణాన్ని వారి జ్ఞానాన్ని ఆచరించడం ద్వారా తీర్చుకోవాలి. ఈ మూడు రుణాలను తీర్చుకున్నప్పుడే ఈ మానవ జన్మకు సార్థకత లభిస్తుంది.
News October 6, 2025
‘ECINet’లో ఎన్నికల పూర్తి సమాచారం: CEC

ఎన్నికల సమాచారం పూర్తిగా ఒకే చోట తెలుసుకునేలా ‘ECINet’ సింగిల్ విండో యాప్‌ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు CEC జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. దీన్ని మథర్ ఆఫ్ ఆల్ యాప్స్‌గా అభివర్ణించారు. బిహార్ ఎలక్షన్స్ నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. ఎలక్షన్స్‌కు సంబంధించిన 40కి పైగా యాప్స్‌ను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు. బూత్ లెవల్ ఆఫీసర్స్ నుంచి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ వరకు అందరినీ ఇది అనుసంధానం చేయనుంది.