News July 29, 2024
కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణం.. కేసు సీఐడీకి బదిలీ

TG: కమర్షియల్ ట్యాక్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసును సీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు రాష్ట్రాలతో ఈ కేసు ముడిపడి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రూ.1,000 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మాజీ సీఎస్, అప్పటి వాణిజ్య పన్నుల కార్యదర్శి సోమేశ్ కుమార్ సహా పలువురిపై కేసు నమోదు చేశారు.
Similar News
News November 7, 2025
శుభ సమయం (07-11-2025) శుక్రవారం

✒ తిథి: బహుళ విదియ మ.2.28 వరకు
✒ నక్షత్రం: కృతిక ఉ.6.58 వరకు
✒ శుభ సమయాలు: ఉ.10.05-10.35, సా.5.40-6.10
✒ రాహుకాలం: ఉ.10.30-12.00
✒ యమగండం: మ.3.00-సా.4.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, మ.12.24-1.12
✒ వర్జ్యం: రా.9.52-11.22
✒ అమృత ఘడియలు: శే. అమృతం ఉ.6.45 వరకు, రా.2.21-3.50
News November 7, 2025
TODAY TOP STORIES

* చొరబాటుదారులను కాపాడే పనుల్లో RJD, కాంగ్రెస్ బిజీ: మోదీ
* బిహార్లో ముగిసిన తొలి విడత పోలింగ్.. 64.66% ఓటింగ్ నమోదు
* డిజిలాకర్లో సర్టిఫికెట్లు, హెల్త్ రికార్డులు: CM CBN
* చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్
* BRS ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: CM రేవంత్
* రేవంత్కు రోషముంటే KTRను జైల్లో పెట్టాలి: బండి సంజయ్
* T20లో ఆసీస్పై భారత్ విక్టరీ.. సిరీస్లో 2-1 లీడ్
News November 7, 2025
మరో 4 ‘వందేభారత్’లు.. ఎల్లుండి ప్రారంభం

దేశంలో మరో 4 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. లక్నో-సహరన్పూర్, ఎర్నాకుళం-బెంగళూరు, బనారస్-ఖజురహో, ఫిరోజ్పూర్-ఢిల్లీ మార్గాల్లో ఇవి నడవనున్నాయి. ఎల్లుండి ఉదయం 8.15 గంటలకు వారణాసిలో ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. కాగా ఆగస్టు నాటికి దేశంలో 150 వందేభారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. గరిష్ఠంగా గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.


