News June 17, 2024
గత ఐదేళ్లు తిరుమలలో ప్రతి పనికీ కమీషన్లే: భానుప్రకాశ్

AP: వైసీపీ హయాంలో తిరుమలలో ప్రతి పనికీ 10శాతం నుంచి 15శాతం వరకు కమీషన్ల వసూళ్లు నడిచాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ప్రొటోకాల్ దర్శనం మొదలు ప్రసాదం వరకు అన్నింట్లోనూ అవకతవకలు జరిగాయన్నారు. ఆ అరాచకాలపై న్యాయవిచారణ జరగాలని, తప్పు చేసిన ప్రతి ఒక్కర్నీ చట్టం ముందుకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మాజీ సీఎం జగన్ ఇక తీర్థయాత్రలు చేసుకోవాలని ఆయన హితవు పలికారు.
Similar News
News December 10, 2025
పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

తెలంగాణలో రేపు తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3,800 గ్రామాల్లో సర్పంచ్, వార్డుల సభ్యులను ఎన్నుకోనున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు రేపు సెలవు ప్రకటించారు. ఆయా స్కూళ్లకు ఇవాళ కూడా హాలిడే ఉంది. తర్వాత జరిగే 2 విడతల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13,14(ఆదివారం),16,17న కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.
News December 10, 2025
తాజా సినీ ముచ్చట్లు

* యాంటీ ఏజింగ్ రీసెర్చ్ చేసేవాళ్లు కొన్నిరోజులు అక్కినేని నాగార్జున గారిపై పరిశోధనలు చేయాలి: విజయ్ సేతుపతి
* రోషన్ కనకాల-సందీప్ రాజ్ కాంబోలో వస్తున్న ‘మోగ్లీ’ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్
* రాబోయే ఐదేళ్లలో దక్షిణాదిన రూ.12 వేల కోట్లతో కంటెంట్ని సృష్టించబోతున్నట్లు ప్రకటించిన జియో హాట్ స్టార్
* ‘అన్నగారు వస్తారు’ నాకో ఛాలెంజింగ్ చిత్రం: హీరో కార్తి
News December 10, 2025
చిన్నారులకు విటమిన్ డి ఎందుకు అవసరమంటే?

పిల్లల ఎముకలు,కండరాల ఆరోగ్యం విషయంలో విటమిన్ D పాత్ర చాలా ముఖ్యమైనది. రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంలో D విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ D లోపం కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు, నిరంతరం అలసట, జుట్టు పల్చబడటం, గాయాలు నెమ్మదిగా మానడం మొదలైనవి విటమిన్ D లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.


