News February 11, 2025
మద్యం నుంచి TDP పెద్దలకు కమీషన్లు: YCP

AP: రాష్ట్రంలో మద్యం ధరలు పెరగడంపై YCP ఆరోపణలు చేసింది. ‘మద్యం వ్యాపారం ప్రభుత్వ పెద్దల వ్యక్తిగత ఆదాయ వనరుగా మారింది. ఈ మేరకు లైసెన్సీలకు మార్జిన్ పెంచుతున్నారు. దీంతో TDP పెద్దలకు కూడా కమీషన్ పెరుగుతోంది. అంతిమంగా మద్యం రేట్లు పెరుగుతున్నాయి. ఇది మందుబాబులకు పెనుభారంగా మారనుంది’ అని ట్వీట్ చేసింది. రూ.99 బ్రాండ్ క్వార్టర్, బీర్లు కాకుండా మిగతా మద్యం సీసాపై రూ.10 పెంచిన విషయం తెలిసిందే.
Similar News
News November 26, 2025
కర్నూలు జిల్లా నుంచి అధ్యక్షా.. అనేది వీరే..!

సంవిధాన్ దివస్-రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని (మాక్ అసెంబ్లీ) కల్పించారు. బుధవారం కర్నూలు జిల్లా నుంచి అసెంబ్లీలో మాట్లాడేందుకు జిల్లా ఎమ్మెల్యేలు (విద్యార్థులు) సిద్ధమయ్యారు. దయాన, లోకేశ్వర్ రెడ్డి, గాయత్రి, నవనీత్ కుమార్, వీరేంద్ర, గౌతమి, ప్రవీణ్ ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించనున్నారు.
News November 26, 2025
స్టూడెంట్స్ అసెంబ్లీ.. దద్దరిల్లుతున్న సభ

AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరుగుతున్న ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ వాడివేడిగా జరుగుతోంది. విద్యార్థులు మంచి అంశాలపై చర్చ జరుపుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ప్రశ్నలు ఎక్కుపెడుతున్నారు. మంత్రులు వీటికి దీటుగా బదులిస్తున్నారు. లోకేశ్, పవన్ కళ్యాణ్ పాత్రలు పోషిస్తున్న చిన్నారులు పంచ్ డైలాగులతో సమాధానాలు ఇస్తున్నారు. సభ పక్కదారి పట్టకుండా స్పీకర్(అమ్మాయి) అదుపు చేస్తున్నారు.
News November 26, 2025
జూన్-జులై మధ్య గోదావరి పుష్కరాలు?

AP: గోదావరి పుష్కరాలను 2027 జూన్ 26-జులై 7 మధ్య నిర్వహించనున్నట్లు సమాచారం. వేదపండితులతో దేవదాయ శాఖ చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆమోదం తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుందని అధికారవర్గాలు వెల్లడించాయి. గోదావరి పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్లపై CM CBN త్వరలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నాయి. చివరిసారి 2015లో గోదావరి పుష్కరాలు జరిగిన విషయం తెలిసిందే.


