News July 22, 2024
రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: గవర్నర్

AP: విభజన వల్ల రాష్ట్రానికి నష్టం ఏర్పడిందని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ‘చంద్రబాబు విజనరీ నాయకుడు. 2014-2019 మధ్య రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగింది. ఆ తర్వాత YCP అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయి. పెట్టుబడులు పక్కదారి పట్టాయి. రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లింది’ అని వివరించారు.
Similar News
News December 9, 2025
విజయ్ సభకు తుపాకీతో వచ్చిన వ్యక్తి!

కరూర్ తొక్కిసలాట తర్వాత TVK చీఫ్, నటుడు విజయ్ తొలిసారి ప్రజల మధ్యకు వస్తున్నారు. నేడు పుదుచ్చేరిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పాలంలోని ఎక్స్పో గ్రౌండ్లో అధికారులు భద్రతా పరంగా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఓ వ్యక్తి తుపాకీతో ప్రవేశించేందుకు యత్నిస్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతడు శివగంగై జిల్లా టీవీకే కార్యదర్శి ప్రభుకు గార్డుగా పనిచేసే డేవిడ్గా గుర్తించారు.
News December 9, 2025
బాలీవుడ్ బ్లాక్బస్టర్ మూవీకి సీక్వెల్?

బ్లాక్బస్టర్ మూవీ ‘3 ఇడియట్స్’కు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని చర్చ జరుగుతోంది. ఈ సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ 15 ఏళ్ల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుందనే పాయింట్తో తెరకెక్కనుందని సమాచారం. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ‘3 ఇడియట్స్’లో ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
News December 9, 2025
చాట్ జీపీటీతో కొత్త వంగడాల సృష్టి సులభమా?

వాతావరణ మార్పులు, కరవు, వరదల వల్ల వ్యవసాయంలో కొత్త వంగడాల అవసరం పెరిగింది. కొత్త వంగడాల అభివృద్ధికి ప్రస్తుతం చాలా సమయం పడుతోంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా గుర్తించగలదు.


