News August 22, 2024

పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కోసం కమిటీ: సీఎం చంద్రబాబు

image

AP: పరిశ్రమలు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. ‘పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం. రెడ్ కేటగిరీ పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి. పరిశ్రమల అనుబంధ శాఖలన్నీ ఉమ్మడిగా పనిచేయాలి. అన్ని శాఖలు ఒకేసారి తనిఖీలు నిర్వహించాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తాం. ఎవరైనా కుట్రలు చేసినా ఎక్కువ రోజులు సాగవు’ అని అచ్యుతాపురం ఘటనపై వ్యాఖ్యానించారు.

Similar News

News January 24, 2025

తలకు ఆనుకొని భారీ కణితి.. కాపాడిన వైద్యులు

image

ఫొటో చూసి రెండు తలలతో ఉన్న శిశువు అనుకుంటున్నారా? కాదు. ఈ పాపకు తలతో పాటు భారీ కణితి ఏర్పడింది. దీనిని ఆక్సిపిటల్ ఎన్సెఫలోసెల్ అనే డిసీస్ అని ఓ వైద్యుడు ఈ ఫొటో షేర్ చేశారు. పుట్టుకతోనే మెదడుతో పాటు చుట్టుపక్కల కణజాలం పుర్రె నుంచి బయటకు వస్తాయని తెలిపారు. ఎంతో క్లిష్టమైన చికిత్సను తాము పూర్తిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. గర్భిణులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయడం వల్ల వీటిని ముందే గుర్తించవచ్చన్నారు.

News January 24, 2025

400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యం!

image

యూపీ సంభల్‌లోని అల్లీపూర్‌లో దాదాపు 300-400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యమయ్యాయి. గురు అమరపతి మెమోరియల్ సైట్ వద్ద బయటపడిన ఈ నాణేల్లో ఒక దానిపై సీతారాములు, లక్ష్మణుని చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో కొన్ని బ్రిటిష్ కాలం నాటివి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక్కడ 21 మంది సాధువుల సమాధులు ఉన్నాయని, ఇటీవల ఓ అస్థిపంజరం బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ స్మారక ప్రదేశం 1920 నుంచి ASI రక్షణలో ఉంది.

News January 24, 2025

మోసం చేసిన భార్య.. దిమ్మతిరిగే షాకిచ్చిన భర్త

image

ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన 5 నెలలకే తనను వదిలిపెట్టిన భార్యకు భర్త గట్టిగా బుద్ధి చెప్పాడు. రాజస్థాన్ కోటాకు చెందిన మనీశ్ మీనా తన భార్య సప్నను చదివించేందుకు భూమిని తాకట్టు పెట్టి రూ.15 లక్షల లోన్ తీసుకున్నాడు. సప్న 2023లో రైల్వేలో ఉద్యోగం సాధించింది. ఉద్యోగం లేదని భర్తను దూరం పెట్టింది. సప్నకు బదులు డమ్మీ క్యాండిడేట్ ఎగ్జామ్ రాశాడని మనీశ్ ఆధారాలు సమర్పించడంతో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.