News February 22, 2025
ఐకానిక్ టవర్ నిర్మాణం కోసం కమిటీ

AP: అమరావతిలో NRT సొసైటీ ఐకాన్ టవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో 9 మంది అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అమరావతికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చేందుకు ఈ ప్రాజెక్టును సర్కార్ నిర్మిస్తోంది.
Similar News
News February 22, 2025
విదేశీ జోక్యం: కాంగ్రెస్‌పై దాడి పెంచిన BJP

USAID నిధులపై <<15542230>>ట్రంప్<<>> వివరాలు చెప్పే కొద్దీ కాంగ్రెస్, రాహుల్ గాంధీపై BJP విమర్శల తీవ్రతను పెంచుతోంది. వాటిని ప్రతిపక్షాల గెలుపు కోసమే బైడెన్ కేటాయించినట్టు ఆరోపిస్తోంది. ED, CBI, ఇంటెలిజెన్స్‌తో దర్యాప్తు చేపట్టాలని కోరుతోంది. గతంలో పదేపదే USకు వెళ్లే RG ఇప్పుడెందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తోంది. ప్రజాస్వామ్యం నాశనమవుతోందంటూ అక్కడ ఆయన అంతర్జాతీయ సమాజ జోక్యం కోరడాన్ని గుర్తుచేస్తోంది.
News February 22, 2025
GOOD NEWS.. నెలకు రూ.7500?

EPFO కనీస పెన్షన్‌ను పెంచాలని ఉద్యోగులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. 2014 నుంచి రూ.1000 పెన్షన్ వస్తుండగా, దీనిని రూ.7500కు పెంచాలని కోరుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులతో ఈ పెన్షన్ చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి PF డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి FEB 28న జరిగే భేటీలో దీనిపై EPFO సెంట్రల్ బోర్డు ప్రకటన చేస్తుందనే ఆశతో ఉన్నారు.
News February 22, 2025
BREAKING: బాలుడు అర్ణవ్ కన్నుమూత

TG: హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంటు లిఫ్టు-గోడకు మధ్య <<15540977>>ఇరుక్కున్న బాలుడు<<>> అర్ణవ్ కన్నుమూశాడు. తీవ్ర గాయాలతో నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. నడుము దగ్గర సర్జరీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.