News April 3, 2025

కంచ భూముల వివాదంపై కమిటీ ఏర్పాటు

image

TG: గచ్చిబౌలి కంచ భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఈ కమిటీలో చోటు కల్పించింది. HCU, విద్యార్థులు, ప్రజాసంఘాలతో ఈ కమిటీ సంప్రదింపులు జరపనుంది. కాగా భూముల్లో జరుగుతున్న పనులను తక్షణం నిలిపివేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Similar News

News January 22, 2026

మిస్టర్ బీన్‌తో డేటింగ్‌లో లేను: మియా ఖలీఫా

image

మిస్టర్ బీన్ నటుడు రోవాన్ ఆట్కిన్సన్‌తో మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా డేటింగ్‌లో ఉన్నారని, వీరు వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నారంటూ ఓ వార్త SMలో వైరలైంది. దీనిపై అంతర్జాతీయ మీడియా సైతం కోడై కూయడంతో మియా స్పందించారు. ‘నేను ఒక మూర్ఖుడితో డేటింగ్ చేస్తున్నాను. కానీ అది మిస్టర్ బీన్ కాదు’ అని ఆమె X వేదికగా క్లారిటీ ఇచ్చారు. 71ఏళ్ల రోవాన్ ఆట్కిన్సన్‌ ప్రస్తుతం లూయిస్ ఫోర్డ్‌తో డేటింగ్‌లో ఉన్నారు.

News January 22, 2026

PV సింధు అరుదైన ఘనత

image

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రికార్డు సృష్టించారు. ఇండోనేషియా మాస్టర్స్ 2026 టోర్నమెంట్‌లో డెన్మార్క్ ప్లేయర్ హోజ్మార్క్‌పై గెలిచి ఇంటర్నేషనల్ కెరీర్‌లో 500 విజయాలు సొంతం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన ఆరో మహిళా సింగిల్ ప్లేయర్‌గా ఘనత సాధించారు. సింధు విన్నింగ్ పర్సంటేజీ 68.22%గా ఉంది.

News January 22, 2026

IIFCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>IIFCL <<>>ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల వారు ఫిబ్రవరి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ (ఫైనాన్స్/MBA/PGDM/ఎననామిక్స్, టూరిజం మేనేజ్‌మెంట్, ESG మేనేజ్‌మెంట్), BE/BTech/B.Arch, CA/CFA/CWA, LLB, LLM, MTech, M.Planing ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ, స్క్రీనింగ్/షార్ట్ లిస్టింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: iifclprojects.in