News July 11, 2024

ట్రైనీ IAS పూజ వ్యవహారంపై విచారణ కమిటీ

image

అధికారాలను దుర్వినియోగం చేసిన ట్రైనీ IAS <<13605832>>పూజా<<>> ఖేద్కర్ వ్యవహారంపై కేంద్రం చర్యలు చేపట్టింది. ఇంటర్వ్యూ సమయంలో ఆమె సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించేందుకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2 వారాల్లో తన నివేదికను సమర్పించనుంది. మరోవైపు వివాదం నేపథ్యంలో పుణేలోని పూజ ఇంటికెళ్లిన మీడియాపై ఆమె తల్లి చిందులు తొక్కారు. కెమెరామెన్లపై అరుస్తూ తోసేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

Similar News

News November 22, 2025

రెండేళ్ల పాలనా విజయాలు ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్: CM

image

TG: ఫ్యూచర్ సిటీలో DEC 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. రెండేళ్ల పాలనా విజయాలు ప్రతిబింబించేలా ఈ వేడుక ఉండాలని సూచించారు. 8న ప్రభుత్వ పథకాలు, విజయాలను చాటి చెప్పాలన్నారు. 9న తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఉండాలని చెప్పారు. పరిశ్రమలు, పెట్టుబడులకు ఇచ్చే ప్రాధాన్యంపై ఆడియో, వీడియో ప్రజెంటేషన్లు రెడీ చేయాలన్నారు.

News November 22, 2025

BREAKING: నిజామాబాద్ DCC అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి

image

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాట్పల్లి నగేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయన నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. ఇక నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణను నియమించారు.

News November 22, 2025

సత్యసాయి బాబా సిద్ధాంతాలే నిజమైన విద్య: ఉప రాష్ట్రపతి

image

AP: సత్యసాయి బాబా సిద్ధాంతాలు, సూత్రాలే నిజమైన విద్య అని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంస్థలో పట్టభద్రులైన వారికి పట్టాలు అందజేసి మాట్లాడారు. ‘ఇతరుల గురించి బతకడమనేది ఉత్తమ విధానం. ఆధునిక విధానాలతో పాటు సంప్రదాయాలను పాటించాలి. డ్రగ్స్ ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. నో టూ డ్రగ్స్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలి’ అని ఆయన సూచించారు.