News June 28, 2024
పరీక్షల్లో సంస్కరణలకు కమిటీ.. మీ సలహాలు ఇవ్వండి: కేంద్రం

పరీక్షల నిర్వహణలో సంస్కరణలకు, NTA ప్రక్షాళన కోసం కేంద్రం ఓ ఉన్నతస్థాయి <<13490528>>కమిటీని<<>> ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇస్రో మాజీ ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఈ కమిటీ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సలహాలు స్వీకరిస్తోంది. జులై 7 వరకు వాటిని సమర్పించవచ్చని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఇందుకోసం ఇక్కడ <
Similar News
News November 25, 2025
బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్: సుందర్

గువాహటి పిచ్ బ్యాటింగ్కు అనుకూలమేనని భారత ఆల్రౌండర్ <<18375894>>వాషింగ్టన్<<>> సుందర్ అన్నారు. పరుగులు చేయకుండా ఎక్కువ సేపు నియంత్రించలేరని చెప్పారు. ‘ఇదేమీ బ్యాటింగ్కు కష్టమైన పిచ్ కాదు. ట్రూ వికెట్. ఇలాంటివి ఇండియాలో అరుదుగా ఉంటాయి. క్రీజ్లో నిలబడితే రన్స్ వస్తాయి’ అని తెలిపారు. 6 వికెట్లు తీసిన జాన్సెన్కు అసాధారణ బౌన్స్ రాలేదని, అతడు ఎత్తుగా ఉండటం వల్ల గుడ్ లెంత్లో బౌలింగ్ చేశారని పేర్కొన్నారు.
News November 25, 2025
మంచి జరగబోతోంది: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ పీస్ టాక్స్లో ముందడుగు పడినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హింట్ ఇచ్చారు. ‘శాంతి చర్చల విషయంలో పెద్ద పురోగతి సాధించడం సాధ్యమేనా? మీరు చూసే దాకా దీన్ని నమ్మకండి. కానీ ఏదో ఒక మంచి జరగబోతోంది’ అని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. కాగా యూఎస్ శాంతి ప్రతిపాదనను మెరుగుపరచాలని అంగీకరించినట్లు జెనీవా చర్చల తర్వాత అమెరికా, ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.
News November 25, 2025
UAEలో సెటిల్ అవ్వాలని ప్లాన్లు.. ఎందుకిలా?

భారతీయులతో పాటు ఇతర దేశస్థులూ యూఏఈలో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేకపోవడం, మెరుగైన మౌలిక వసతులు, పబ్లిక్ సర్వీస్, సేఫ్టీ అని నిపుణులు చెబుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఆయిల్ ఎగుమతులు, కార్పొరేట్ ట్యాక్స్, హోటళ్లు, వీసా, లైసెన్స్ ఫీజులు, టోల్ ట్యాక్స్ ద్వారా ఆదాయం తెచ్చుకుంటుంది. దీంతో పెద్దపెద్ద <<18378539>>వ్యాపారవేత్తలకు<<>> దుబాయ్ డెస్టినేషన్గా మారింది.


