News August 9, 2024

సరిహద్దుల్లో పరిస్థితులపై పర్యవేక్షణకు కమిటీ: కేంద్రం

image

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో పరిస్థితులపై పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి అమిత్‌షా వెల్లడించారు. ఆ దేశంలోని హిందువులు, భారతీయుల భద్రతను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు. అటు అక్కడి హింసాత్మక ఘటనల దృష్ట్యా పలువురు భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు.

Similar News

News October 24, 2025

స్లీపర్ బస్సులు బ్యాన్ చేయాలా?

image

AP: కర్నూలు బస్సు <<18088805>>ప్రమాద<<>> ఘటనతో స్లీపర్ బస్సుల్లో సేఫ్టీపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. 8-9 అడుగుల ఎత్తు, సీట్ల మధ్య ఇరుకుగా ఉండటంతో ఎమర్జెన్సీ సమయంలో బయటికెళ్లడం కష్టమై ప్రాణనష్టం పెరుగుతోంది. వందలాది మంది మరణిస్తుండటంతో చైనా 2012లోనే స్లీపర్ బస్సులను బ్యాన్ చేసింది. మన దేశంలోనూ నిషేధించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు?

News October 24, 2025

ట్రెండ్ Shift: బ్రాండ్ కాదు! మ్యాటర్ ఉందా? లేదా?

image

IIT, IIMలలో చదివినోళ్లకే కంపెనీల రెడ్ కార్పెట్ అనే ట్రెండ్ మారుతోంది. ప్రస్తుతం టైర్-3 కాలేజ్ గ్రాడ్యుయేట్లనూ కంపెనీలు సెలక్ట్ చేసుకుంటున్నాయని కమ్యూనిటీ యాప్ ‘బ్లైండ్’ సర్వేలో వెల్లడైంది. యాపిల్, NVIDIA, SAP, పేపాల్, జోహో వంటి సంస్థల్లో 1/3 ఎంప్లాయిస్ సాధారణ కాలేజీల్లో చదివిన వారేనట. బ్రాండెడ్ ఇన్‌స్టిట్యూట్స్ మొదట్లో జాబ్ పొందడంలో వాల్యూ యాడ్ చేస్తున్నా ఆ తర్వాత టాలెంట్ ఆధారంగా గ్రోత్ ఉంటోంది.

News October 24, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* కర్నూల్ బస్సు ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దిగ్ర్భాంతి.. రహదారుల భద్రతపై కఠిన చర్యలు చేపట్టాలని సూచన
* ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్న BJP స్టేట్ చీఫ్ రామ్‌చందర్‌రావు
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో 58 మంది.. నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్న 23 మంది
* సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి టాలీవుడ్ ప్రముఖులతో ప్రభుత్వ ప్రత్యేక కమిటీ చర్చలు