News August 29, 2025
రుషికొండ ప్యాలెస్‌పై మంత్రులతో కమిటీ

AP: రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ సభ్యులుగా కందుల దుర్గేశ్, పయ్యావుల కేశవ్, డీబీవీ స్వామిని నియమించింది. వీరు ఈ రిసార్ట్‌ను ఎలా వినియోగించాలనే దానిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఆ నివేదిక ప్రకారం సర్కార్ చర్యలు తీసుకుంటుంది.
Similar News
News August 30, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News August 30, 2025
శుభ సమయం (30-08-2025) శనివారం

✒ తిథి: శుక్ల సప్తమి రా.7.43 వరకు
✒ నక్షత్రం: విశాఖ మ.1.07 వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు
✒ యమగండం: మ.1.30-3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36 వరకు
✒ వర్జ్యం: సా.5.32-7.18 వరకు
✒ అమృత ఘడియలు: మ.4.09-5.55 వరకు
News August 30, 2025
TODAY HEADLINES

* ఏపీకి బుల్లెట్ ట్రైన్: CM చంద్రబాబు
* విద్యార్థులు, టీచర్లకు ఫేషియల్ రెకగ్నిషన్: CM రేవంత్
* జపాన్ పర్యటనలో మోదీ.. పలు ఒప్పందాలు
* భారత్-చైనా స్నేహం ప్రపంచానికి ముఖ్యం: మోదీ
* రుషికొండ నిర్మాణాలను వినియోగిస్తాం: Dy.CM
* భవిష్యత్తులో ఏఐ రెవల్యూషన్: లోకేశ్
* ఇక నుంచి వేగంగా పెన్షన్లు: మంత్రి సీతక్క
* హీరోయిన్ ధన్సికతో హీరో విశాల్ నిశ్చితార్థం