News September 22, 2025

ఎయిర్‌ఇండియా విమానంలో కలకలం

image

బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిర్‌ఇండియా ఫ్లైట్లో ఓ ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. దీనిపై ఎయిర్‌ఇండియా స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ప్రయాణికుడు టాయిలెట్ అనుకుని పొరపాటున కాక్‌పిట్ డోర్ తీయడానికి ప్రయత్నించాడని తెలిపింది. భద్రతా పరమైన సమస్య తలెత్తలేదని ప్రకటించింది. అతడిని CISF అదుపులోకి తీసుకుంది.

Similar News

News September 22, 2025

గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం: రవూఫ్ భార్య

image

పాక్ మ్యాచ్ ఓడిపోయినా తన భర్త చేసిన పనితో గర్వంగా ఉన్నానని ఆ జట్టు బౌలర్ హారిస్ రవూఫ్ భార్య ముజ్నా మసూద్ తెలిపింది. నిన్న మ్యాచ్ సందర్భంగా రవూఫ్ ‘ఆపరేషన్ సిందూర్’లో భారత్ 6 ఫైటర్ జెట్లను కోల్పోయిందని వేళ్లతో <<17788891>>సంజ్ఞలు<<>> చేశాడు. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ముజ్నా.. ‘గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం’ అని పేర్కొంది. యుద్ధమైనా, ఆటైనా గెలిచేది భారతే అని టీమ్ ఇండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

News September 22, 2025

మైథాలజీ క్విజ్ – 13 సమాధానాలు

image

1. దశరథుణ్ని వరాలు కోరమని కైకేయిని ప్రేరేపించింది ఆమె దాసి అయిన ‘మంధర’.
2. మహాభారతంలో కాశీరాజు పుత్రికలు అంబ, అంబిక, అంబాలిక.
3. కృష్ణుడిని చంపడానికి అఘాసురుడు భారీ కొండచిలువ రూపం ధరించాడు.
4. శ్రీశైలంలోని భ్రమరాంబికా దేవి కృష్ణా నది తీరాన కొలువై ఉంది.
5. శ్రీరాముడు రావణుడిని సంహరించిన సందర్భంగా దసరా పండుగను జరుపుకొంటారు.
<<-se>>#mythologyquiz<<>>

News September 22, 2025

ఆ వేడుకకు పవన్ అన్నను ఆహ్వానించా: లోకేశ్

image

AP: కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే ఇచ్చిన మాట నిలుపుకుందని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘Dy.CM పవన్ అన్నను మర్యాదపూర్వకంగా కలిశాను. ఈనెల 25న MEGA DSC విజేతలకు నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానించాను. గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోగా DSCని అడ్డుకోవాలని 87 కేసులు వేశారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ టీచర్ల కలలు సాకారం చేశామని వివరించా’ అని ట్వీట్ చేశారు.