News August 19, 2024

26000 ఉద్యోగుల్ని తొలగించిన కంపెనీలు

image

రిటైల్ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. FY24లో 12 లైఫ్‌స్టైల్, గ్రాసరీ, క్విక్‌సర్వీస్ రెస్టారెంట్లు దాదాపుగా 26వేల మందిని తొలగించాయి. రిలయన్స్, టైటాన్, పేజ్, రేమండ్, స్పెన్సర్ మొత్తం వర్క్‌ఫోర్స్ FY23లో 455000 ఉండగా FY24లో 429000కు తగ్గింది. కస్టమర్లు ఫ్యాషన్ దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లను తగ్గించడంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Similar News

News October 27, 2025

ప్రతి కుటుంబ ఆదాయంపై కేంద్రం సర్వే

image

జనగణన… ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్… తాజాగా ఈ సర్వేల జాబితాలోకి మరొకటి చేరింది. పాన్ ఇండియా స్థాయిలో ఆదాయ సర్వేకు కేంద్రం నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా 2026 FEB నుంచి ఈ ఆదాయ గణనను MoSPI ఆరంభిస్తుంది. ప్రతి కుటుంబ ఆదాయాన్ని లెక్కించనుంది. 2027 మధ్యలో సర్వే వివరాలు ప్రకటిస్తారు. అయితే ఇన్‌కమ్ వివరాలు రాబట్టడం సవాళ్లతో కూడుకున్నది కావడంతో ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.

News October 27, 2025

త్వరలో SBIలో 3,500 పోస్టుల భర్తీ!

image

వచ్చే 6 నెలల్లో ఎస్బీఐ 3500 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో 505 పీఓ పోస్టులు ఉన్నట్లు ఎస్బీఐ డిప్యూటీ ఎండీ కిశోర్ కుమార్ వెల్లడించారు. 3వేల సర్కిల్ ఆధారిత అధికారులను నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రిలిమినరీ, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా పీఓ పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు. బ్యాంక్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రిపేర్ కావొచ్చు.

News October 27, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు!

image

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏపీ మీదుగా నడిచే 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు కొన్ని రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొంది. ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణానికి ముందు రైల్ స్టేటస్ చూసుకోవాలని సూచించింది.
* ట్రైన్స్ లిస్ట్ కోసం పైన ఫొటోలను స్లైడ్ చేయండి.