News September 20, 2025

2,569 మందికి కారుణ్య నియామకాలు: లోకేశ్

image

AP: రాష్ట్రంలో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల కింద పోస్టింగులు ఇచ్చినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. మొత్తం 3,441 మంది నుంచి అప్లికేషన్స్ రాగా.. వారిలో 2,569 మందికి కారుణ్య నియామకాల కింద పోస్టింగులు ఇచ్చినట్లు వెల్లడించారు.

Similar News

News September 20, 2025

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. ఉచితంగా లడ్డూ ప్రసాదం

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవ ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకుంది. మూలా నక్షత్రం, దశమి రోజుల్లో టికెట్లు లేకుండా దర్శనం కల్పించడంతో పాటు దర్శన సమయం 22 గంటలకు పెంచింది. ఉచితంగా లడ్డూ ప్రసాదం, పంచ హారతిలో ప్రముఖుల ప్రత్యేక దర్శనాల రద్దు, అంతరాలయ దర్శనాల నిలిపివేత, రూ.500 టికెట్లు రద్దు వంటి నిర్ణయాలు తీసుకుంది. కాగా ఈ నెల 22 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

News September 20, 2025

న్యూడ్ వీడియో కాల్స్ చేసి.. రూ.3.8 కోట్లు వసూలు

image

నాగర్‌కర్నూల్ (TG) జిల్లాకు చెందిన మల్లేశ్, భార్య మేరీ, స్నేహితురాలు లిల్లీ Xలో ‘సంయుక్త రెడ్డి’ పేరిట అకౌంట్ క్రియేట్ చేశారు. కర్నూలుకు చెందిన ఓ వ్యాపారిని పరిచయం చేసుకుని న్యూడ్ వీడియోలు పంపారు. ఓ మహిళతో వాట్సాప్ వీడియో కాల్స్ చేయించారు. ఆ తర్వాత తక్కువ ధరకే పొలాలు, ప్లాట్లు అమ్ముతామని నమ్మించారు. దాంతో పాటు బెదిరించి రెండేళ్లలో రూ.3.8 కోట్లు వసూలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.

News September 20, 2025

ఇండియన్ల వద్దే 72శాతం H1B వీసాలు

image

అమెరికా ప్రభుత్వం జారీచేసే H1B వీసాలు అత్యధికంగా ఇండియన్ల వద్దే ఉన్నాయి. FY2022 వరకూ జారీచేసిన వాటిల్లో భారతీయుల వద్ద 72.6శాతం.. అంటే 3,20,791 వీసాలు ఉండటం గమనార్హం. ఆ తర్వాత చైనాకు చెందిన 55,038(12.5%) మంది వద్ద H1B వీసాలున్నాయి. అలాగే కెనడా వద్ద ఒక శాతం(4,235), సౌత్ కొరియా వద్ద 0.9శాతం(4,097) ఉండగా, ఫిలిప్పీన్స్ ప్రజలు 0.8శాతం (3,501) వీసాలు కలిగిఉన్నారు.