News January 9, 2025
తిరుపతి బాధితులకు నేడు పరిహారం ప్రకటన

AP: తిరుపతి తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలకు నేడు CM చంద్రబాబు పరిహారం ప్రకటిస్తారని TTD ఛైర్మన్ B R నాయుడు తెలిపారు. ఘటనపై ఆయన చాలా సీరియస్ అయ్యారని చెప్పారు. టోకెన్ కేంద్రం వద్ద ఉన్న DSP గేట్లు తెరవడంతో భక్తులందరూ తోసుకురావడం వల్లే ఘటన జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనం 19వరకు ఉంటుందని వెల్లడించారు.
Similar News
News February 1, 2026
వీటి ధరలు తగ్గే ఛాన్స్!

ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీల తయారీకి సంబంధించిన పరికరాలపై కేంద్రం కస్టమ్స్ డ్యూటీ తొలగించింది. దీంతో ఈవీ ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. మైక్రోవేవ్ ఓవెన్ పరికరాలు, సోడియమ్ యాంటీమోనేట్‌పైనా కస్టమ్స్ డ్యూటీ తొలగించింది. దీంతో మైక్రోవేవ్ ఓవెన్స్, సోలార్ గ్లాస్ ధరలు తగ్గనున్నాయి. సీఫుడ్ ధరలు తగ్గనున్నాయి. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్, ఏవియేషన్‌కు సంబంధించిన ముడిసరకులపైన కేంద్రం పన్ను మినహాయింపు ఇచ్చింది.
News February 1, 2026
రేర్‌పై మోర్ ఫోకస్.. ఉపయోగాలివే

రేర్ ఎర్త్ మెటల్స్, మినరల్స్‌పై కేంద్రం మోర్ ఫోకస్ పెట్టిన కేంద్రం.. ఏపీ, ఒడిశా, TN, కేరళకు <<19020730>>ప్రత్యేక కారిడార్స్‌ను<<>> కేటాయించింది. దీనివల్ల EV, IC, స్మార్ట్ ఫోన్స్, టర్బైన్స్, మిసైల్స్, సెమీ కండక్టర్స్‌కు అవసరమైన 17 రకాల అత్యంత అరుదైన ఖనిజాలను ఇక్కడే సేకరించి ప్రాసెస్ చేయనుంది. దీంతో చైనా, USపై ఆధారపడటం తగ్గుతుంది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌తో గ్లోబల్ మార్కెట్లో పాగా వేసేందుకు వీలవుతుంది.
News February 1, 2026
కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలో 50% కట్!

సరికొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని FM నిర్మలా సీతారామన్ తెలిపారు. సంస్కరించిన ఈ నియమావళిని రికార్డు టైమ్‌లో పూర్తిచేసినట్టు వెల్లడించారు. సింప్లిఫై చేసిన రూల్స్, ఫామ్స్‌ను త్వరలోనే నోటిఫై చేస్తామన్నారు. వీటికి అలవాటు పడేందుకు ట్యాక్స్ పేయర్లకు సరిపడా టైమ్ ఇస్తామని చెప్పారు. కొత్త చట్టంలో పన్ను రేట్లలో మార్పులుండవని, 50% సెక్షన్లు తొలగించినట్టు వివరించారు.


