News March 25, 2025
పంట నష్టానికి త్వరలో పరిహారం: మంత్రి తుమ్మల

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. పంట నష్టం వివరాలు సేకరించేందుకు అధికారులను నియమించామని తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. అధికారుల నుంచి పూర్తి స్థాయి నివేదిక రాగానే పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు.
Similar News
News December 26, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండి రేటు రూ.9,000 పెరిగి రూ.2,54,000కు చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.770 పెరిగి రూ.1,40,020కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.700 పెరిగి రూ.1,28,350 పలుకుతోంది.
News December 26, 2025
ఫ్లాట్గా మొదలైన స్టాక్ మార్కెట్లు..

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్గా మొదలయ్యాయి. నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 26,130 వద్ద, సెన్సెక్స్ 50 పాయింట్లు కోల్పోయి 85,350 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్లో భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్, ఎన్టీపీసీ, ట్రెంట్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ఉండగా, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా, టీసీఎస్, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
News December 26, 2025
లిప్ లైనర్ వాడుతున్నారా?

లిప్స్టిక్ వేసుకొనేముందు లిప్ లైనర్ వాడటం ముఖ్యం. దీని వల్ల మీ లిప్స్టిక్ కిందికి, పైకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. అలాగే ఇది పెదాలకు సరైన షేప్ ఇస్తుందని చెబుతున్నారు. లైనర్తో పెదాల చుట్టూ ఔట్ లైన్ గీసి తర్వాత లిప్స్టిక్ వెయ్యాలి. లిప్స్టిక్ వేశాక తప్పనిసరిగా టిష్యూతో లిప్స్ని ప్రెస్ చేయండి. ఇది స్మడ్జింగ్, ఎక్స్ట్రా లిప్స్టిక్ని దూరం చేస్తుందని సూచిస్తున్నారు.


