News March 21, 2024
‘మాజీ జవాన్‌కు రూ.50లక్షల పరిహారం’.. సైన్యానికి సుప్రీం ఆదేశం

తప్పుడు కారణంతో ఉద్యోగం కోల్పోయిన మాజీ జవాన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రూ.50 లక్షల పరిహారం సహా పెన్షన్ అందించాలని సైన్యాన్ని ధర్మాసనం ఆదేశించింది. కాగా 2001లో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆ జవాన్‌కు మిలిటరీ ఆస్పత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో HIV ఉన్నట్లు తప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఫలితంగా ఆయనను విధుల్లోంచి తొలగించారు. దీనిపై ఆయన సుప్రీంను ఆశ్రయించగా ఈ మేరకు తీర్పునిచ్చింది.
Similar News
News October 21, 2025
సమాజాన్ని మేలుకొల్పే చిత్రాలకు చిరునామా ఆయన

సామాజిక అంశాలనే కథాంశంగా సంచలన సినిమాలు తీసిన దర్శకుడిగా టి.కృష్ణ పేరొందారు. విజయశాంతిని స్టార్‌ను చేసిన ‘ప్రతిఘటన’ చిత్రానికి ఆయనే డైరెక్టర్. నేటి భారతం, వందేమాతరం, దేవాలయం, దేశంలో దొంగలు పడ్డారు, రేపటి పౌరులు, అర్ధరాత్రి స్వతంత్రం తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన 1987లో కన్నుమూశారు. హీరో గోపీచంద్ ఈయన కుమారుడే. ఇవాళ టి.కృష్ణ వర్ధంతి.
News October 21, 2025
సైబర్ క్రైమ్ గ్యాంగ్ లీడర్.. కేరాఫ్ చాయ్‌వాలా

బిహార్‌లో అభిషేక్ కుమార్ అనే చాయ్‌వాలా అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నెట్వర్క్ లీడర్‌గా తేలాడు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో సైబర్ నేరాలకు పాల్పడిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అభిషేక్ ఇంట్లో సోదాలు చేపట్టి రూ.1.05 కోట్ల నగదు, 344గ్రా. గోల్డ్, 1.75KGs సిల్వర్ సీజ్ చేశారు. 85 ATM కార్డులు, 75 బ్యాంక్ పాస్‌బుక్స్, 28 చెక్‌బుక్స్, ఆధార్ కార్డ్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్, లగ్జరీ కారు స్వాధీనం చేసుకున్నారు.
News October 21, 2025
బీపీ కంట్రోల్లో ఉండాలంటే..

వయసుతో సంబంధం లేకుండా చాలామంది హై బ్లడ్ ప్రెషర్(బీపీ)తో బాధపడుతున్నారు. ఉదయమే కొన్నిరకాల డ్రింక్స్ తీసుకోవడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకోవడం, బీట్రూట్ జ్యూస్, కొబ్బరినీళ్లు, గ్రీన్ టీ, ఉసిరి జ్యూస్ వంటి వాటిలో నిత్యం ఏదో ఒకటి తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
SHARE IT