News March 17, 2024
ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి: జగదీశ్‌రెడ్డి

TG: రాష్ట్రంలో పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు రూ.50వేలు, మిరప తోటలకు ఎకరాకు రూ.80వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ఇదే సమయానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు జలకళతో కళకళలాడాయని, ఇప్పుడు వెలవెలబోతున్నాయని చెప్పారు.
Similar News
News April 16, 2025
ALERT: లాసెట్ దరఖాస్తు గడువు పెంపు

TG: LLB, LLM కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, పీజీ సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. దరఖాస్తు చేసుకునేందుకు నిన్నటితో గడువు ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఈ నెలాఖరు వరకూ పొడిగించినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చని వివరించారు. ఇప్పటి వరకు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు.
News April 16, 2025
వక్ఫ్ సవరణ చట్టంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

వక్ఫ్ సవరణ చట్టంపై నేటి నుంచి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం జరగనుంది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ మొత్తం 73 పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్, టీఎంసీ, సీపీఐ, వైసీపీ, ఎస్పీ, టీవీకే, ఆర్జేడీ, జేడీయూ, ఆప్, ఎంఐఎం పార్టీలతో పాటు ఆల్ ఇండియా ముస్లిం లీగ్, ఇతరులు ఈ పిటిషన్లు వేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం మ.2 గంటల నుంచి వాదనలు విననుంది.
News April 16, 2025
భారీగా తగ్గిన ధర.. కేజీ రూ.6!

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గాయి. మొన్నటి వరకు రూ.1800-రూ.2300 పలికిన క్వింటాల్ ఉల్లి.. ఇప్పుడు రూ.1300కు పడిపోయింది. కనిష్ఠంగా క్వింటాల్ ధర రూ.600 పలుకుతోంది. అంటే కేజీ రూ.6 మాత్రమే. పెట్టుబడి రావడం కూడా కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. అటు మార్కెట్లో కేజీ ఉల్లి ధర రూ.25-30గా ఉంది.