News September 11, 2025
వరద బాధితులకు వెంటనే పరిహారం విడుదల చేయాలి: మంత్రి

TG: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ‘పరిహారం అందని వారికి వెంటనే నిధులు విడుదల చేయండి. బాధితులు పరిహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రాకూడదు. చెరువులు, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు ₹10Cr, ఇతర జిల్లాలకు ₹5Cr విడుదల చేశాం’ అని తెలిపారు.
Similar News
News September 11, 2025
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలో రిషబ్ శెట్టి?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఓ స్పెషల్ రోల్‌లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఆయన పాత్ర ఉంటుందని టాక్. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఈ మూవీలో టొవినో థామస్, అనిల్ కపూర్ వంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News September 11, 2025
ప్రాంతీయ పార్టీల ఇన్‌కమ్ రిపోర్ట్.. టాప్‌లో BRS

2023-24 FYలో దేశంలోని 40 ప్రాంతీయ పార్టీలు ₹2,532 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయని ADR నివేదిక తెలిపింది. ఇందులో 83% విరాళాల ద్వారా వచ్చినట్లు పేర్కొంది. ఈ లిస్టులో ₹685.51 కోట్లతో BRS టాప్‌లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో TMC ₹646.39Cr, BJD ₹297Cr, TDP ₹285Cr, YCP ₹191Cr ఉన్నాయి. మొత్తం పార్టీల ఆదాయంలో ఈ 5 పార్టీల ఆదాయమే 83.17% ఉన్నట్లు పేర్కొంది. కాగా 40 పార్టీల ఖర్చుల మొత్తం ₹1,320Crగా ఉంది.
News September 11, 2025
మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించింది పింక్ డైమండ్ కాదు: ASI

తిరుమల శ్రీవారికి 1945లో మైసూరు మహారాజు జయచామరా రాజేంద్ర వడియార్ సమర్పించింది పింక్ డైమండ్ కాదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఆలయంలోని పింక్ డైమండ్ మాయమైందని 2018లో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు చేయడంతో దీనిపై ASI అధ్యయనం చేసింది. తాము సేకరించిన సమాచారం ప్రకారం అది హారం అని, అందులో కెంపులు, రత్నాలు మాత్రమే ఉన్నాయని ASI డైరెక్టర్ వెల్లడించారు.