News July 25, 2024

చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు 3 కేటగిరీల్లో పరిహారం: APSRTC

image

AP: సర్వీసులో ఉంటూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు 3 కేటగిరీల్లో పరిహారం చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లాస్-4 ఉద్యోగులైతే ₹5లక్షలు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులైతే ₹8L, గెజిటెడ్ ఉద్యోగులైతే ₹10L ఇవ్వనుంది. ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందే అర్హత లేకపోవడం, ఆ ఫ్యామిలీలో మరెవరూ సంపాదించే వారు లేకపోతే ఈ పరిహారం అందించనున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది.

Similar News

News December 3, 2025

ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు తత్కాల్ అవకాశం: DEO

image

ఏపీ ఓపెన్ స్కూల్ 2025–2026 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు తత్కాల్ పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 2 నుంచి 6 వరకు అవకాశం ఉందని డీఈవో నారాయణ తెలిపారు. విద్యార్థులు రూ.600 అపరాధ రుసుము చెల్లించి అడ్మిషన్ పొందవచ్చునని అన్నారు. పూర్తి వివరాలను https://apopenschollo.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవాలని ఆయన సూచించారు.

News December 3, 2025

విశాఖలో 12 నుంచి కాగ్నిజెంట్ కార్యకలాపాలు

image

AP: ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖలో ఈ నెల 12 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం ఐటీ పార్కులోని తాత్కాలిక భవనంలో తన సెంటర్ ఏర్పాటు చేయనుంది. అదే రోజు కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. 2028 జూన్ నాటికి తొలి దశ నిర్మాణాలు పూర్తవుతాయని సమాచారం.

News December 3, 2025

పెళ్లి కాని వారు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవచ్చా?

image

పెళ్లికాని వారు కూడా సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిరభ్యంతరంగా ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు. సాయంత్రం వేళలో చేసే ఈ వ్రతానికి అధిక ఫలితం ఉంటుందని అంటున్నారు. ‘ఈ వ్రతాన్ని ఇంట్లోనే కాకుండా ఆలయాలు, నదీ తీరాలు, సాగర సంగమాల వద్ద కూడా చేసుకోవచ్చు. స్వామివారి కథ విన్నా కూడా శుభం జరుగుతుంది. ఇంట్లో ఏదైనా అశుభం జరిగినప్పుడు, సూతకం వంటివి ఉన్నప్పుడు వ్రతాన్ని చేయకపోవడం మంచిది’ అంటున్నారు.