News September 25, 2024

రెండు రోజుల్లో రైతులకు పరిహారం

image

TG: అకాల వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. రెండు రోజుల్లో రైతులకు పరిహారం అందిస్తామని వెల్లడించారు. పంట నష్టానికి సంబంధించి జిల్లాల నుంచి నివేదికలు రావాల్సి ఉందని, కేంద్రం నుంచి ఇప్పటివరకు వరద సాయం అందలేదని మంత్రి చెప్పారు. తక్షణ సాయంగా రూ.10వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల తాము కోరినట్లు ఆయన తెలిపారు.

Similar News

News January 19, 2026

కాంగ్రెస్, BRS, TDP సోషల్ మీడియా వార్.. ఫొటోలు వైరల్

image

TG: BRS దిమ్మెలను కూల్చివేయాలన్న CM రేవంత్ వ్యాఖ్యలతో రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. తెలంగాణ గడ్డపై గాంధీ భవన్, ఎన్టీఆర్ భవన్ లేకుండా చేస్తామంటూ BRS నేతలు పోస్టులు చేస్తున్నారు. వాటిని కూల్చివేసినట్లు AI జనరేటెడ్ ఫొటోలు క్రియేట్ చేశారు. అటు కాంగ్రెస్, TDP నేతలు సైతం BRS పార్టీని, తెలంగాణ భవన్‌ను నేలమట్టం చేస్తామంటూ AI ఫొటోలు పెడుతున్నారు.

News January 19, 2026

పశువుల్లో క్షయ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

image

పశువుల్లో క్షయ వ్యాధి మైకోబాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులు శ్వాస వదిలినప్పుడు, తుమ్మినప్పుడు.. మైకోబాక్టీరియా గాలిలో కలిసిపోతుంది. ఈ బాక్టీరియాతో కలుషితమైన మేత, నీరు, పాలను తాగడం వల్ల క్షయ వ్యాధి ఇతర పశువులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువులు బరువు తగ్గుతాయి. ముక్కు నుంచి నీరు కారుతుంది. ఈ లక్షణాలు కనిపించిన జీవాలను ఇతర పశువుల నుంచి వేరు చేసి వెటర్నరీ నిపుణులకు చూపించాలి.

News January 19, 2026

కులాన్ని ఉద్దేశించని దూషణ శిక్షార్హం కాదు: SC

image

SC, STలపై కులాన్ని ఉద్దేశించి కాకుండా కేవలం అవమానించేలా చేసే దూషణలు శిక్షార్హమైనవి కావని SC పేర్కొంది. బిహార్‌లో ఓ కేసులో ట్రయిల్ కోర్టు ఇచ్చిన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని నిందితుడు వేసిన పిటిషన్‌ను HC డిస్మిస్ చేసింది. కాగా HC ఆర్డర్లు, ప్రొసీడింగ్స్‌ను జస్టిసులు పార్థివాలా, అలోక్ ఆరాధేలు నిలిపివేస్తూ దిగువకోర్టులు SC, ST ACT కింద చర్యలు చేపట్టడంలో విఫలమయ్యాయని అన్నారు.