News September 10, 2024
వరద బాధితులకు త్వరలో నష్టపరిహారం: మంత్రి నారాయణ

AP: విజయవాడ వరద బాధితులకు త్వరలో నష్టపరిహారం అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. తాజాగా వరద ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, సాయంత్రానికి వరద పూర్తిగా తగ్గుతుందన్నారు. 1.7లక్షల మందికి నిత్యావసర సరుకులు అందించామని, ఆస్తి నష్టంపై సర్వే జరుగుతోందని చెప్పారు.
Similar News
News December 3, 2025
ముగింపు ‘అఖండ-2’ తాండవమేనా!

ఈ ఏడాదిలో ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి విడుదలైన చిత్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం, OG బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టాయి. భారీ అంచనాలతో విడుదలైన గేమ్ ఛేంజర్ ఆకట్టుకోలేకపోయింది. డిసెంబర్లో బడా చిత్రాల్లో ‘అఖండ-2’తో ఈ ఏడాదికి ముగింపు పలకనుంది. సినిమాపై ఉన్న బజ్ కలెక్షన్లపై ఆశలు రేకెత్తిస్తున్నా బాలయ్య మూవీ రికార్డులు సృష్టిస్తుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
News December 3, 2025
ధోనీ రూమ్లో చాలా చేసేవాళ్లం: మైక్ హస్సీ

క్రికెట్ మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ధోనీ ఆఫ్ఫీల్డ్లో ఎలా ఉంటారో CSK మాజీ ఆటగాడు, కోచ్ హస్సీ వెల్లడించారు. ప్రతి IPL సీజన్లో ధోనీ రూమ్ అనధికారిక టీమ్ లాంజ్లా మారేదన్నారు. ప్లేయర్లు 24 గంటలూ అక్కడే మాట్లాడుకోవడం, ఫుడ్ షేర్ చేసుకోవడం, కొందరు హుక్కాతో రిలాక్స్ అవ్వడం జరిగేదన్నారు. ఇటువంటి బాండింగ్ కారణంగానే CSK ఒక కుటుంబంలా మారిందని అభిప్రాయపడ్డారు.
News December 3, 2025
సమంతతో పెళ్లిపై రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్!

సమంతను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ రాజ్ నిడిమోరు సోదరి శీతల్ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘చంద్రకుండ్లో శివుడిని ప్రార్థిస్తూ లింగాన్ని ఆలింగనం చేసుకున్నా. ఆనందబాష్పాలతో నా హృదయం ఉప్పొంగుతోంది. ఇప్పుడు మా కుటుంబం పరిపూర్ణమైంది. వీరికి మేమంతా అండగా ఉంటాం. వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది’ అని ఆమె రాసుకొచ్చారు. ‘లవ్ యూ’ అని సామ్ దీనికి రిప్లై ఇచ్చారు.


