News January 11, 2025

బాధితులకు రేపు పరిహారం: బీఆర్ నాయుడు

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలు, గాయపడ్డ బాధితులకు రేపటి నుంచి టీటీడీ పరిహారం అందించనుంది. టీటీడీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీ దేవి, మహేందర్ రెడ్డి, ఎంఎస్ రాజు, భాను ప్రకాశ్ రెడ్డి APలో.. మిగతా వారు తమిళనాడు, కేరళలో పర్యటించి పరిహారం అందిస్తారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.2లక్షలు ఇస్తారు.

Similar News

News March 9, 2026

అలాంటి వీడియోలు ఫోన్‌లో సేవ్ చేసుకున్నా నేరమే: హైకోర్టు

image

చైల్డ్ పోర్నోగ్రఫీపై కర్ణాటక హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి వీడియోలు, ఫొటోలను షేర్ చేయకపోయినప్పటికీ మొబైల్‌లో స్టోరేజీలో ఉన్నా ఐటీ చట్టంలోని సెక్షన్ 67B, పోక్సో యాక్ట్‌లోని సెక్షన్ 15 ప్రకారం నేరమేనని తేల్చిచెప్పింది. అవి కలిగి ఉండటం శిక్షార్హమని తెలిపింది. అశ్లీల వీడియోలను ఫోన్‌లో సేవ్ చేసుకున్న వ్యక్తి తనపై నమోదైన కేసులను కొట్టేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చింది.

News March 9, 2026

GREAT: 6 గంటలు శ్రమించి పులికి ఆపరేషన్ (PHOTOS)

image

పట్నా జూకు తరలించేందుకు సన్నాహాలు చేస్తుండగా ఢిల్లీ జూలోని ఏడాదిన్నర ఏళ్ల ‘దుర్గ’ అనే తెల్ల పులి రెండు కాళ్లు విరిగిపోయాయి. దీనికి ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’(ICAR) వైద్యులు అధునాతన ఆర్థోపెడిక్ పద్ధతులతో ఆపరేషన్ చేశారు. దాదాపు 6 గంటల పాటు శ్రమించి ఈ ప్రక్రియను పూర్తిచేశారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి అని ICAR దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.

News March 9, 2026

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై స్టే

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రయల్ కోర్ట్ తీర్పులో సీబీఐపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కవితలతో సహా 23 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఇటీవల వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది.