News June 4, 2024
2 చోట్ల పోటీ.. కేఏ పాల్‌కు ఎన్ని ఓట్లంటే?

AP: ‘పాల్ రావాలి-పాలన మారాలి’ అనే నినాదంతో ప్రచారం చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను ఓటర్లు పట్టించుకోలేదు. కుండ గుర్తుకు ఓటేయాలని 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆయనకు ఆశించిన ఓట్లు పడలేదు. గాజువాక MLA అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు ఇప్పటివరకు 394 ఓట్లు రాగా, విశాఖ MP అభ్యర్థిగా నిలిచిన పాల్‌కు 1190 ఓట్లు లభించాయి. దీంతో పాల్ కుండ పగిలిందని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
Similar News
News November 10, 2025
కొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చిన UIDAI.. ఫీచర్స్ ఇవే

కొత్త ఆధార్ యాప్‌ను UIDAI తీసుకొచ్చింది. ఆధార్ వివరాలను ఫోన్లో స్టోర్ చేసుకునేందుకు, ఇతరులతో పంచుకునేందుకు రూపొందించినట్లు Xలో పేర్కొంది. ప్లేస్టోర్, యాపిల్ స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆధార్‌లోని ఎంపిక చేసిన వివరాలనే షేర్ చేసుకునే సదుపాయం ఇందులో ఉండటం విశేషం. మిగతా సమాచారం హైడ్ చేయవచ్చు. అలాగే బయోమెట్రిక్ వివరాలను లాక్ లేదా అన్ లాక్ చేసుకోవచ్చు. ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ కూడా ఉంది.
News November 10, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

☛ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజహరుద్దీన్.. సచివాలయంలో ప్రార్థనల అనంతరం బాధ్యతలు
☛ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ సీఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్.. పాల్గొన్న హరీశ్ రావు, తలసాని
☛ వరద ప్రవాహంతో నిలిచిపోయిన ఏడుపాయల వనదుర్గ ఆలయం దర్శనాలు పునఃప్రారంభం
News November 10, 2025
రష్యా భయంతో రక్షణ వ్యయాన్ని పెంచుతున్న EU దేశాలు

రష్యా దాడి భయంతో యూరోపియన్ దేశాలు తమ రక్షణ వ్యయాన్ని భారీగా పెంచుకుంటున్నాయి. తాజాగా జర్మనీ $1.2Bతో ఎయిర్ బస్ నుంచి 20 మిలటరీ హెలికాప్టర్ల కొనుగోలుకు ఆర్డరిచ్చింది. 2027 నాటికి ఇవి అందనున్నాయి. ఇప్పటికే అది 62 H145M హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. కాగా సాయుధ దళాల అత్యవసర ఆధునీకరణ కోసం జర్మనీ ఈ ఏడాదిలో ప్రత్యేక నిధినీ ఏర్పాటు చేసింది. ఈ ఆర్డర్లతో అనేక ఆయుధ తయారీ సంస్థలు ప్రయోజనాలు పొందుతున్నాయి.


