News September 7, 2024
లంచం అడిగితే ఈ నంబర్లకు ఫిర్యాదు చేయండి: TGSPDCL

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TGSPDCL)కు చెందిన ఉద్యోగులు ఏదైనా పనికోసం లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. 040-23454884 లేదా 7680901912 నంబర్లకు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. కొంతమంది సిబ్బంది అవినీతికి పాల్పడుతూ సంస్థకు చెడ్డ పేరు తెస్తున్నారని అన్నారు.
Similar News
News December 20, 2025
22నే పంచాయతీ పాలకవర్గాల తొలి భేటీ

TG: పంచాయతీల్లో కొత్త పాలకవర్గాల తొలి సమావేశం 22వ తేదీన నిర్వహించనున్నారు. ఈమేరకు పంచాయతీరాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ముందుగా పంచాయతీ కార్యాలయాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం పాలకవర్గాలు సమావేశమై చర్చిస్తాయి. కాగా 18 జిల్లాల్లో 90 పంచాయతీల్లో నిలిచిపోయిన ఉప సర్పంచ్ ఎన్నికను ఈసీ ఆదేశాలతో అధికారులు ఈరోజు నిర్వహిస్తున్నారు.
News December 20, 2025
గుడ్లు తింటే క్యాన్సర్ రాదు: FSSAI

గుడ్లను తింటే క్యాన్సర్ వస్తుందని <<18572969>>జరుగుతున్న<<>> ప్రచారాన్ని FSSAI ఖండించింది. కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తిలో ప్రమాదకర నైట్రోఫ్యూరాన్లు, యాంటీబయాటిక్లపై నిషేధం కొనసాగుతోందని తెలిపింది. ‘గరిష్ఠంగా KGకి 1.0 మైక్రోగ్రామ్ నైట్రోఫ్యూరాన్లు ఉండొచ్చు. వీటివల్ల ప్రమాదం లేదు. ఫుడ్ సేఫ్టీ వయలేషన్గా పరిగణించలేం. నైట్రోఫ్యూరాన్లకు క్యాన్సర్కు సంబంధం లేదు. మన దేశంలో గుడ్లు సురక్షితం’ అని స్పష్టం చేసింది.
News December 20, 2025
APPLY NOW: APEDAలో ఉద్యోగాలు

<


