News November 5, 2024

షకీబ్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు

image

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్ శైలిపై అంపైర్లు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. కౌంటీల్లో సర్రే తరఫున ఆడుతున్న షకీబ్ బౌలింగ్‌పై అంపైర్లు అనుమానం వ్యక్తం చేశారు. కాగా దాదాపు 13 ఏళ్ల తర్వాత షకీబ్ కౌంటీల్లో రీఎంట్రీ ఇచ్చారు. సోమర్‌సెట్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆయన 9 వికెట్లు తీశారు.

Similar News

News December 26, 2024

గోల్డ్ అవార్డు గెలుచుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంధన పొదుపులో గోల్డ్ అవార్డు గెలుచుకుంది. అవార్డును విశాఖ ఉక్కు కర్మాగారం తరఫున ఇంధన, పర్యావరణం జనరల్ మేనేజర్ ఉత్తమ బ్రహ్మ, డీజిఎం విజయానంద్ గురువారం విజయవాడలో స్వీకరించారు. స్టీల్ ప్లాంట్‌కు మరోసారి ప్రతిష్ఠాత్మకమైన అవార్డు సాధించినందుకు ప్లాంట్ సీఎండీ ఏకె సక్సేనా అధికారులు సిబ్బందిని అభినందించారు.

News December 26, 2024

ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ నిర్మించనున్న చైనా

image

ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా సిద్ధమవుతోంది. టిబెట్‌లోని యార్లంగ్ జాంగ్‌బో(బ్రహ్మపుత్ర) నదిపై దీన్ని నిర్మించనుంది. పూర్తైతే ఏడాదికి 300 బిలియన్ కిలో‌వాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. దీని కోసం భారీగా నిధులు వెచ్చించనున్నట్లు బీజింగ్ వర్గాలు తెలిపాయి. బ్రహ్మపుత్ర నది భారత్‌లోని అరుణాచల్, అస్సాం రాష్ట్రాల మీదుగా బంగ్లాదేశ్‌లోకి వెళ్లి బంగాళాఖాతంలో కలుస్తుంది.

News December 26, 2024

అజెర్‌బైజాన్ విమానాన్ని కూల్చేశారా?

image

అజెర్‌బైజాన్‌లో నిన్నటి విమాన ప్రమాదం రష్యా దాడి వల్లే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఫ్లైట్ అజెర్‌బైజాన్‌లోని బాకు సిటీ నుంచి రష్యాకు వెళ్తుండగా కుప్పకూలింది. ఆ సమయానికి రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. విమానాన్ని ఉక్రెయిన్ దాడిగా పొరబడి రష్యా ఎయిర్ డిఫెన్స్ దాన్ని కూల్చేసి ఉండొచ్చని పలువురు ఆరోపిస్తున్నారు. విమానం బాడీపై బులెట్ల ఆనవాళ్లుండటం దీనికి ఊతమిస్తోంది.