News November 29, 2024
‘ఆర్మీ’ని అవమానించారంటూ అల్లు అర్జున్‌పై ఫిర్యాదు
తన ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ ‘ఆర్మీ’ అనే పదాన్ని వాడటాన్ని గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్, వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు తప్పుబట్టారు. తనకూ ఓ ఆర్మీ ఉందంటూ దేశ రక్షణ బలగాలను అవమానించే విధంగా ఆయన వ్యవహరించారని HYDలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్‌పై FIR నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 30, 2024
జడ్జికే లంచం ఇవ్వబోయాడు.. అరెస్టయ్యాడు!
గుజరాత్లో ఏకంగా న్యాయమూర్తికే లంచం ఇచ్చేందుకు యత్నించాడో వ్యక్తి. పంచమహల్ జిల్లా కోర్టులోకి ప్రవేశించిన బాపూ సోలంకీ అనే వ్యక్తి సరాసరి న్యాయమూర్తి ముందు ఓ సీల్డ్ కవర్ పెట్టాడు. కోర్టు సిబ్బంది దాన్ని ఓపెన్ చేయగా రూ.35వేలు కనిపించాయి. ఇదేంటని ప్రశ్నిస్తే ఎవరో ఇవ్వమన్నారని సమాధానమిచ్చాడు. జడ్జి ఆదేశాల మేరకు ACB అధికారులు అతడ్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని వారు తెలిపారు.
News November 30, 2024
మెడికల్ కాలేజీల ఆస్తులు జప్తు చేసిన ఈడీ
తెలంగాణలో మెడికల్ కాలేజీలకు చెందిన రూ.9.71 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఇందులో మల్లారెడ్డి కాలేజీ రూ.2.89 కోట్లు, MNR కాలేజీ రూ.2.01 కోట్లు, చల్మెడ ఆనందరావు కాలేజీ రూ.3.33 కోట్ల ఆస్తులున్నాయి. పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసి మేనేజ్మెంట్ కోటాలో అమ్ముుకున్నట్లు ఆయా కాలేజీలపై ఆరోపణలొచ్చాయి. దీంతో గతేడాది జూన్‌లో రాష్ట్రంలోని 16 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించి, కేసులు నమోదు చేసింది.
News November 30, 2024
మ్యాచ్ ఫిక్సింగ్.. ముగ్గురు SA క్రికెటర్లు అరెస్ట్
మ్యాచ్-ఫిక్సింగ్ ఆరోపణలతో ముగ్గురు సౌతాఫ్రికా క్రికెటర్లు అరెస్టయ్యారు. 2016లో డొమెస్టిక్ T20 రామ్ స్లామ్ ఛాలెంజ్ టోర్నీలో వీరు ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. దీంతో లెనాక్స్ త్సోత్సోబే (40), థమ్సంకా త్సోలేకిలే (44), ఎథీ మభలతి (43)లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.