News April 3, 2024
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

AP: సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి లేఖ రాశారు. ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా నా కుటుంబంపై జగన్ నిరాధార ఆరోపణలు చేశారు. విశాఖలో డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంలో సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంస్థలో మాకు వాటా ఉందని సీఎం ఓ సభలో మాట్లాడారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు.
Similar News
News January 17, 2026
పాలమూరుకు కేసీఆర్ ఒక్క ప్రాజెక్టు సాధించలేదు: CM రేవంత్

TG: పదేళ్ల BRS ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని MBNR జిల్లా పర్యటన సందర్భంగా CM రేవంత్ విమర్శించారు. ‘దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా అందులో పాలమూరు బిడ్డల శ్రమ ఉంది. కానీ ఈ జిల్లాకు KCR ఒక్క ప్రాజెక్టు సాధించలేదు. పాలమూరు-RR పేరిట రూ.23వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినా ఎత్తిపోతలు పూర్తి చేయలేదు. ఉదండాపూర్ భూనిర్వాసితులకు నిధులు చెల్లించలేదు’ అని ఆరోపించారు.
News January 17, 2026
PHOTOS: HYDలో అబ్బురపరిచే హాట్ ఎయిర్ బెలూన్ షో

TG: హైదరాబాద్లో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో 18 బెలూన్స్ గాల్లో సందడి చేస్తున్నాయి. గోల్కొండ వద్ద ఆకాశం నుంచి తీసిన ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి. అటు ఇవాళ ఉదయం ఓ బెలూన్ సాంకేతిక సమస్యతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందన్న వార్తలను నిర్వాహకులు ఖండించారు. అందులో వాస్తవం లేదన్నారు.
News January 17, 2026
రాహుల్ను అవమానించానని ఫీలవుతున్నా: జగ్గారెడ్డి

TG: సంగారెడ్డిలో జీవితంలో పోటీ చేయనని PCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ‘గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సంగారెడ్డి వచ్చి నన్ను గెలిపించాలని కోరితే ఇక్కడివారు ఓడించారు. ఆయన్ను సంగారెడ్డికి పిలిచి అవమానించానేమోనని ఫీలవుతున్నాను. నా ఓటమికి కారణం పేదలు కాదు మేధావులు, పెద్దలే. అందుకే ఇకపై ఇక్కడ పోటీచేయదల్చుకోలేదు. నా భార్య ఇక్కడ పోటీ చేసినా ప్రచారం చేయను’ అని పార్టీ భేటీలో స్పష్టం చేశారు.


