News April 4, 2024
స్టీఫెన్ రవీంద్రపై సీఎంకు ఫిర్యాదు

TG: సైబరాబాద్ మాజీ సీపీ, హోంగార్డ్స్ ఐజీ స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్‌కు కమాండ్ కంట్రోల్ డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదు చేశారు. తాను నార్సింగి సీఐగా ఉన్నప్పుడు భూ వివాదంలో జోక్యం చేసుకున్నానని ఆరోపిస్తూ రవీంద్ర తనను సస్పెండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనివల్ల ప్రమోషన్ పొందలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోషన్ అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు ఆదేశించినా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు.
Similar News
News November 2, 2025
కొండచరియలు విరిగిపడి 21మంది మృతి

భారీ వర్షాలు కెన్యాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. రిఫ్ట్ వ్యాలీలో కొండచరియలు విరిగిపడి 21మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30మంది గల్లంతు అయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వెస్ట్రన్ కెన్యాలో వరదలొచ్చి రోడ్లు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు ధ్వంసమై పలువురు నిరాశ్రయులు అయ్యారు.
News November 2, 2025
చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే..?

శివుడు అభిషేక ప్రియుడు. అందుకే నీటితో అభిషేకం చేసినా ఆయన అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతుంటారు. అయితే చెరకు రసంతో శివుడిని అభిషేకం చేయడం మరింత పుణ్యమని అంటున్నారు. ‘చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలు తొలగి, ధనవృద్ధి కలుగుతుంది. ఈ అభిషేకం ద్వారా చెరుకు లాగే భక్తుల జీవితం కూడా మధురంగా మారుతుందని నమ్మకం. అప్పుల బాధలు తొలగి, ధనానికి లోటు లేకుండా జీవించడానికి ఈ అభిషేకం చేయాలి’ అంటున్నారు.
News November 2, 2025
అడుగులోనే అరక విరిగిందట

పొలం దున్నడానికి ఉపయోగించే ముఖ్యమైన వ్యవసాయ పనిముట్టు అరక. పొలం దున్నడం మొదలుపెట్టి, ఒక అడుగు వేయకముందే లేదా మొదటి అడుగులోనే, ప్రధానమైన పనిముట్టు అయిన అరక విరిగిపోతే పని ముందుకు సాగదు. ఏదైనా ఒక కార్యాన్ని లేదా ప్రయత్నాన్ని ప్రారంభించిన తక్షణమే ఊహించని సమస్య లేదా అవాంతరం ఎదురై మొత్తం ప్రణాళిక లేదా ప్రయత్నం విఫలమైనప్పుడు ఈ సామెత ఉపయోగిస్తారు.


