News April 2, 2025
HCU భూములపై NGTలో ఫిర్యాదు

హైదరాబాద్ HCU భూముల వేలంపాట అంశం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కు చేరింది. వేలం పాట అనైతికం అని న్యాయవాది కారుపోతుల రేవంత్ చెన్నైలోని NGTలో ఫిర్యాదు చేశారు. వేలంపాటను అడ్డుకుని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. నగరానికి కాలుష్యం నుంచి ఉపశమనం కలిగిస్తున్న ఇలాంటి ప్రాంతాలను నాశనం చేయడం సరికాదన్నారు. మరోవైపు ఈ అంశంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.
Similar News
News November 26, 2025
MDK: పంచాయతీ ఎన్నికలు.. అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు

ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జీపీ ఎన్నికల్లో పోటీకి దింపేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు జరుపుతున్నాయి. అర్ధబలం, ప్రజల్లో పేరు ప్రతిష్టలు వున్న నాయకులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు అయినప్పటికీ పల్లెల్లో పట్టు నిలుపుకోవడానికి పంచాయతీ పాలకవర్గం కీలకం. MDKలో 492, SRDలో 613, SDPTలో 508 జీపీలు ఉన్నాయి.
News November 26, 2025
2 కోట్ల ఆధార్ ఐడీల తొలగింపు.. కారణమిదే!

దేశవ్యాప్తంగా 2 కోట్ల ఆధార్ ఐడీలను UIDAI డీయాక్టివేట్ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. డేటా క్లీనింగ్లో భాగంగా చనిపోయిన వ్యక్తుల వివరాలను డిసేబుల్ చేసినట్లు చెప్పింది. ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఇలా చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, భారత రిజిస్ట్రార్ జనరల్ నుంచి వచ్చిన డెత్ రిజిస్ట్రేషన్లు, ఇతర సమాచారం ఆధారంగా డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడించింది.
News November 26, 2025
బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.


