News March 24, 2024

సీ-విజిల్‌లో ఫిర్యాదు.. 100 నిమిషాల్లో చర్యలు

image

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై ఫిర్యాదు చేసేందుకు గూగుల్ ప్లే స్టోర్‌లో సీ-విజిల్ యాప్‌ని EC ప్రవేశపెట్టింది. దీంట్లో ఫిర్యాదు చేసిన వెంటనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్‌లు రంగంలోకి దిగుతాయి. ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తాయి. ఆపై ఆర్వో చర్యలు తీసుకుంటారు. 100 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతారు.

Similar News

News November 21, 2025

తులసికి సమర్పించకూడని నైవేద్యాలివే..

image

తులసి మొక్కపై లక్ష్మీ దేవి ఉంటారని నమ్ముతాం. అందుకే పూజలు చేస్తాం. అయితే ఈ దేవతకు కొన్ని నైవేద్యాలు సమర్పించడం నిషిద్ధమని పండితులు చెబుతున్నారు. శివ పూజకు వాడిన బిల్వ పత్రాలు, పారిజాత పూలు తులసికి సమర్పించకూడదట. చెరుకు రసం కూడా నిషిద్దమేనట. పాలు కలిపిన నీరు, నల్ల విత్తనాలు కూడా వద్దని సూచిస్తున్నారు. గణపతి పూజకు ఉపయోగించిన ఏ వస్తువునూ తులసికి సమర్పించకూడదనే నియమం ఉందంటున్నారు.

News November 21, 2025

మరో తుఫాను ‘సెన్‌యార్‌’!

image

రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ‘సెన్‌యార్’ పేరును IMD పెట్టనున్నట్లు సమాచారం. సెన్‌యార్ అంటే ‘లయన్’ అని అర్థం. తుఫాను ప్రభావంతో 24వ తేదీ నుంచి తమిళనాడులో, 26-29వరకు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇటీవల ‘మొంథా’ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.

News November 21, 2025

కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పేపర్ 2 పరీక్ష ఎప్పుడంటే?

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 552 కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు సంబంధించి పేపర్ 2 పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించింది. డిసెంబర్ 14న డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 12న నిర్వహించిన పేపర్ 1 పరీక్షను 6,332 మంది రాయగా.. పేపర్ 2కు 3,642మంది అర్హత సాధించారు.