News November 19, 2024

రేప్ కేసులపై FBలో ఫిర్యాదు: సుప్రీంకోర్టు కీలక ప్రశ్న

image

మలయాళ నటుడు <<14650875>>సిద్ధిఖ్<<>> రేప్ కేసు విచారణలో SC వ్యాఖ్యలు చర్చనీయంగా అయ్యాయి. 2016లో సిద్ధిఖ్ తనపై లైంగిక దాడి చేశారని ఓ మహిళ మీటూ ఉద్యమం టైమ్‌లో FBలో రాసుకొచ్చారు. తర్వాత FIR ఫైల్ అయింది. ‘FBలో రాయడానికి ధైర్యమున్నప్పుడు ఎనిమిదేళ్లుగా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు’ అని కోర్టు ప్రశ్నించింది. కొన్ని కేసుల్లో భయపడి ఫిర్యాదు చేయకపోవడం, కొన్నింట్లో కావాలనే ఇరికిస్తుండటంతో వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.

Similar News

News November 19, 2024

ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ డౌన్

image

ఈరోజు ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయింది. యూజర్ల నుంచి 1500కి పైగా ఫిర్యాదులు నమోదైనట్లు ఆన్‌లైన్ గ్లిచ్‌ పరిశీలన సంస్థ డౌన్‌డిటెక్టర్ తెలిపింది. 41శాతంమంది వినియోగదారులకు లాగిన్‌లో, మరో 41శాతంమంది సర్వర్ కనెక్షన్లలో ఇబ్బందులెదురైనట్లు పేర్కొంది. యాప్‌ను ఓపెన్ చేయలేకపోతున్నామని, మీడియా అప్‌లోడ్ చేయలేకపోతున్నామని అనేకమంది మెటాకు రిపోర్ట్ చేశారు.

News November 19, 2024

యూపీలో ఈ సారి ద‌మ్ము చూపేదెవరు?

image

UPలో బుధ‌వారం 9 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. LS ఎన్నిక‌ల్లో SP అత్య‌ధికంగా 37 సీట్లు గెలిచి BJPకి స‌వాల్ విసిరింది. దీంతో ఈ ఎన్నికల్ని BJP సవాల్‌గా తీసుకుంది. న‌లుగురు SP, ముగ్గురు BJP, RLD, నిషాద్ పార్టీ నుంచి ఒక‌రు MLAలుగా రాజీనామా చేయ‌డంతో ఉపఎన్నిక అనివార్యమైంది. విడిపోతే న‌ష్ట‌పోతాం అంటూ CM యోగి – పీడితులు, ద‌ళితులు, అల్ప‌సంఖ్యాకుల ఐక్య‌త పేరుతో అఖిలేశ్ ప్ర‌చారాన్ని న‌డిపారు.

News November 19, 2024

90 నిమిషాలు ఆగిన గుండెకు ప్రాణం పోశారు!

image

ఒడిశాలోని భువనేశ్వర్ AIIMS వైద్యులు అద్భుతాన్ని సాధించారు. గత నెల 1న శుభాకాంత్ సాహూ(24) అనే జవాన్ గుండె 90 నిమిషాల పాటు ఆగగా ఎక్స్‌ట్రాకార్పోరియల్ కార్డియో-పల్మనరీ రిససిటేషన్(eCPR) ద్వారా తిరిగి బతికించారు. ఆ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అశుతోశ్ ఆ వివరాలు తెలిపారు. ‘అతడి గుండె ఆగిన తర్వాత 40 నిమిషాల పాటు మామూలు CPR చేసినా ఉపయోగం లేకపోయింది. eCPRతో బతికించాం’ అని వివరించారు.