News April 10, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఈడీకి ఫిర్యాదు

TG: రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై హైకోర్టు న్యాయవాది సురేశ్ ఈడీకి ఫిర్యాదు చేశారు. కేసులో నిందితులు వ్యాపారులను బెదిరించి రూ.కోట్లు వసూలు చేశారన్న సురేశ్.. దీనిపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదన్న సురేశ్.. ఈడీ దర్యాప్తు చేస్తే మూల కారకులు బయటకు వస్తారని పేర్కొన్నారు.
Similar News
News March 24, 2026
మార్చి 24: చరిత్రలో ఈరోజు

1603: బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం
1775: కవి, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు జననం
1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్క్యులాసిస్ను రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు
1977: భారత ప్రధానిగా మొరార్జీ దేశాయ్ బాధ్యతలు (ఫొటోలో)
1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డిసౌజా జననం
1991: సినీ గేయ రచయిత చెరువు ఆంజనేయ శాస్త్రి మరణం
* ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం
News March 24, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 24, 2026
నాసిక్ దొంగ బాబా.. గర్భవతినీ వదల్లేదు

నాసిక్ (MH) దొంగ బాబా అశోక్ ఖారత్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూజలు చేస్తే ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారని నమ్మించి ఒక గర్భవతిని దారుణంగా రేప్ చేశాడు. పెళ్లి కుదురుతుందని నమ్మబలికి మరో యువతిని లోబర్చుకున్నాడు. ఇప్పటికే అరెస్టైన ఈ దొంగ బాబాపై ఇప్పుడు మరిన్ని కేసులు నమోదయ్యాయి. అలాగే కిలో ₹100 దొరికే చింతపిక్కలను రత్నాలంటూ ఒక్కోదాన్ని ₹10,000కు అమ్మి భక్తుల వీక్నెస్తో ఆడుకున్నాడు.


