News April 28, 2024
సీఎస్‌పై గవర్నర్ నజీర్‌కు ఫిర్యాదు

ఏపీ సీఎస్, పింఛన్ల పంపిణీ వ్యవహారంపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ కనుసన్నల్లో సీఎస్ జవహర్ రెడ్డి పని చేస్తున్నారని టీడీపీ నేతలు దేవినేని ఉమ, వర్ల రామయ్య, జనసేన నేత శంకర్ ఆరోపించారు. పింఛన్ల పంపిణీలో సీఎస్ బాధ్యతగా స్పందించలేదని అన్నారు. వచ్చే నెల ఒకటో తేదీన ఇంటికే వెళ్లి పెన్షన్ అందించేలా ప్రభుత్వానికి సూచించాలని గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
Similar News
News September 16, 2025
కూతురు మృతి.. హీరో ఎమోషనల్ కామెంట్స్

చనిపోయిన తన కూతురు మీరాను మిస్సవ్వడం లేదని, ఆమె ఇంకా తనతోనే ఉన్నట్లు భావిస్తున్నానని తమిళ హీరో విజయ్ ఆంటోనీ తెలిపారు. ‘నేను కూతుర్ని కోల్పోలేదు. ఆమె నాతోనే ప్రయాణిస్తోంది. ఆమెతో రోజూ మాట్లాడుతున్నా. ఇందులో ఉన్న డెప్త్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీరా రెండేళ్ల క్రితం ఇంట్లో సూసైడ్ చేసుకోగా, తానూ ఆమెతోనే చనిపోయానని ఆ సమయంలో విజయ్ ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.
News September 16, 2025
భార్య చివరి కోరిక నెరవేర్చిన భర్త

AP: తనను ఉపాధ్యాయుడిగా చూడాలన్న భార్య చివరి కోరికను తీర్చాడు భర్త. ఎన్టీఆర్(D) రెడ్డికుంటకు చెందిన రామకృష్ణ భార్య ఏడాది క్రితం డెంగీతో మరణించారు. ఇటీవల ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్(బయాలజీ)గా DSCలో ఎంపికయ్యారు. ఆమె చివరి కోరికను తీర్చడానికి రోజుకు 10 గంటలకు పైగా చదివినట్లు రామకృష్ణ తెలిపారు. తన భార్య బతికి ఉంటే సంతోషించేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
News September 16, 2025
వివేకా హత్య కేసులో దర్యాప్తుకు సిద్ధం: సీబీఐ

AP: వైఎస్ వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. కోర్టు తగిన ఆదేశాలిస్తే ముందుకు వెళ్తామని పేర్కొంది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని చెప్పింది. ఈ మేరకు సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.