News September 20, 2024
మాజీ మంత్రి విడదల రజనిపై హోంమంత్రికి ఫిర్యాదు

AP: మాజీ మంత్రి రజని, ఆమె PA తమను బెదిరించి ₹2.20cr వసూలు చేశారని పల్నాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ సంస్థ సహ యజమాని చలపతిరావు హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. 2020లో తనను పిలిచి మాట్లాడారని, డబ్బులు ఇవ్వకపోతే కంపెనీని సీజ్ చేయిస్తామని బెదిరించారన్నారు. 2021లో ₹2.20cr ఇచ్చినట్లు తెలిపారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై హోంమంత్రి విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
Similar News
News November 24, 2025
నేరుగా రైతుల నుంచే కొనండి.. హోటళ్లకు కేంద్రం సూచన

వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా రైతుల ఉత్పత్తి సంస్థల (FPO) నుంచే కొనాలని హోటళ్లు, రెస్టారెంట్లను కేంద్ర ప్రభుత్వం కోరింది. సప్లై చైన్ నుంచి మధ్యవర్తులను నిర్మూలించడం ద్వారా రైతుల రాబడిని పెంచవచ్చని చెప్పింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్(GI) ట్యాగ్ ఉన్న ఆహార ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సూచించింది. దేశంలో 35వేల FPOలు ఉన్నాయని, వాటిలో 10వేల వరకు ప్రభుత్వం స్థాపించిందని తెలిపింది.
News November 24, 2025
ఐబొమ్మ రవిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమన్నారంటే?

TG: ఐబొమ్మ రవి రాబిన్హుడ్ హీరో అని ప్రజలు అనుకుంటున్నారని జడ్చర్ల MLA అనిరుధ్ అన్నారు. టికెట్ ధరలు పెంచి దోచుకోవడం తప్పనే భావనలో వారు ఉన్నారని తెలిపారు. ‘₹1000 కోట్లు పెట్టి తీస్తే బాగుపడేది హీరో, డైరెక్టర్, నిర్మాత అని, ₹50-100Cr పెట్టి తీయలేరా అని ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలని మరికొందరు అంటున్నారు. న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి’ అని చెప్పారు.
News November 24, 2025
48 గంటల్లో తుఫానుగా మారనున్న వాయుగుండం

మలేషియా-అండమాన్ సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి 48 గంటల్లో ఇది దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు అధికారులు చెప్పారు.


