News October 16, 2025
బిగ్‌బాస్ షోను నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు

TG: బిగ్‌బాస్ సమాజానికి, ముఖ్యంగా యువతకు తప్పుడు సందేశం ఇస్తోందని గజ్వేల్‌కు చెందిన యువకులు జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్ నిర్వాహకులు సమాజం సిగ్గు పడే విధంగా అభ్యంతరకరమైన కంటెంట్‌తో షో నిర్వహిస్తున్నారని, సమాజంలో విలువలు లేనివారిని ఎంపిక చేస్తున్నారని తెలిపారు. కర్ణాటక తరహాలో ఇక్కడా ఆ షోను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బిగ్‌బాస్ హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
Similar News
News October 16, 2025
‘ఓటుకు నోటు’ కేసు విచారణ వాయిదా

‘ఓటుకు నోటు‘ కేసు నిందితులు రేవంత్, సండ్ర వెంకట వీరయ్య పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 3కి వాయిదా వేసింది. రేవంత్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసు చట్టవిరుద్ధమని నిన్న ఆయన తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. ఏసీబీ చట్టం ప్రకారం లంచం తీసుకోవడమే నేరమని వాదించారు. గురువారం కూడా వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. న్యాయమూర్తులు మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్ కేసు విచారించారు.
News October 16, 2025
50 ఏళ్ల వయసులో సింగర్ రెండో పెళ్లి!

సింగర్ రఘు దీక్షిత్ 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. సింగర్, ఫ్లూటిస్ట్ వారిజశ్రీ వేణుగోపాల్(34)ను ఈ నెలాఖరున ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. 2005లో డాన్సర్ మయూరి ఉపాధ్యాయతో ఆయనకు వివాహం జరగగా 2019లో విడాకులు తీసుకున్నారు. రఘు తెలుగులో శ్రీమంతుడు, S/O సత్యమూర్తి, జనతా గ్యారేజ్ వంటి సినిమాల్లో పాటలు పాడారు. కన్నడ, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో పలు చిత్రాలకు సంగీతం అందించారు.
News October 16, 2025
వంట చేయకపోతేనే హ్యాపీగా ఉంటారట!.. హార్వర్డ్ స్టడీ

తమ భర్తల కోసం వంట చేసేవారితో పోల్చితే చేయని స్త్రీల వైవాహిక జీవితమే సంతోషంగా ఉన్నట్లు హార్వర్డ్ అధ్యయనం తెలిపింది. ‘మహిళ నిత్యం వంట చేయడం వల్ల ఆమె తెలియకుండానే సేవకురాలిగా మారిపోతుంది. దీనివల్ల భాగస్వామ్య భావన తగ్గి, వైవాహిక సంతృప్తి కూడా తగ్గుతుంది’అని అధ్యయనం పేర్కొంది. 15 ఏళ్లపాటు 12వేల విదేశీ జంటలపై సర్వే చేయగా వంట చేసేవారు వైవాహిక జీవితంపై 6.1/10 ఇస్తే చేయనివారు 8.4/10 మార్కులిచ్చారు.